హాస్పిటల్ చేరిన ఎమ్మెల్సీ కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు అనారోగ్య సమస్యలతో హాస్పటల్ లో చేరారు. వైద్య పరీక్ష నిమిత్తం హాస్పిటల్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంగళవారం సాయంత్రానికి వైద్య పరీక్షలు పూర్తవుతాయిని పేర్కొన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో తీహార్‌ జైలులో ఉన్న సమయంలో కవితకు అనారోగ్యంతోపాటు గైనిక్‌ సమస్యలు వచ్చాయి. దీంతో అప్పట్లో దేశ రాజధానిలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నేడు హాస్పిటల్‌లో చేరారు.

This will close in 10060 seconds