akhil surekha

కొండా సురేఖను వదిలేది లేదు – అఖిల్

తమ ఫ్యామిలీ ఫై అనుచిత వ్యాఖ్యలను చేసిన మంత్రి సురేఖను వదిలేది లేదని నటుడు అఖిల్ వార్నింగ్ ఇచ్చారు. ‘కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధారం, హాస్యాస్పదం, అసభ్యకరం, జుగుప్సాకరం. సామాజిక విలువలు, సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన సిగ్గుచేటు, క్షమించరానిది. అమాయకులపై సిగ్గు లేకుండా దాడి చేసి బలిపశువులను చేసింది. బాధిత కుటుంబ సభ్యుడిగా నేను మౌనంగా ఉండను. ఈ సమాజంలో అలాంటి వాళ్లకు స్థానం లేదు’ అని అఖిల్ ట్వీట్ చేశారు.

నాగ చైత‌న్య‌-స‌మంత విడాకుల విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయవర్గాలతో పాటు, అటు సినీ పరిశ్రమలోనూ దుమారం రేపిన‌ విష‌యం తెలిసిందే. దీంతో మంత్రి వ్యాఖ్య‌ల‌ను అంద‌రూ ముక్త‌కంఠంతో ఖండించారు.

Innovative pi network lösungen. Hest blå tunge. Kenya news facefam.