13న అలయ్ బలయ్.. తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం – విజయలక్ష్మి

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సారి కూడా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 13న హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కమిటీ ఛైర్పర్సన్ బండారు విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లతో పాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు.

ఈ కార్యక్రమంతో రాజకీయాలతో సంబంధం లేకుండా అందరు ఒకే వేదికపైకి వస్తారు. కాగా ఈ అలయ్ బలయ్ లో అన్న రకాల వంటకాలు ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణకు చెందిన వంటలు వడ్డిస్తారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్వహించనున్నారు. గత సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. CMలు చంద్రబాబు, రేవంత్రెడ్డితోపాటు పలు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రమంత్రులు, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించినట్లు ఆమె చెప్పారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నారు.