భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరిన నేపథ్యంలో, దేశంలోని విమానయాన రంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అత్యవసరంగా సమావేశమై ఉత్తర మరియు పశ్చిమ భారతదేశంలో ఉన్న 32 ఎయిర్పోర్టులను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ చర్యలు ఈ నెల 15వ తేదీ వరకు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.
మూసివేసిన ఎయిర్పోర్ట్స్
మూసివేసిన ఎయిర్పోర్టులలో ముఖ్యంగా అలంపూర్, అంబాలా, అమృత్సర్, అవంతిపొర, భటిండా, హల్వారా, హిండన్, జమ్మూ, చండీగఢ్, భుజ్, బికనీర్, జామ్నగర్, కండ్లా, కంగ్రా, కిషానఢ్, కులూ-మనాలి, జైసల్మేర్, జోధ్పూర్, లూథియానా, రాజ్కోట్, సిమ్లా, శ్రీనగర్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉన్నవి ఉన్నాయి. వీటి మూసివేతతో పౌర విమానయాన సేవలపై తీవ్ర ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు.
దేశ భద్రత దృష్ట్యా ఇది అనివార్య చర్య
ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులకు తాత్కాలిక అసౌకర్యం కలుగుతుండగా, దేశ భద్రత దృష్ట్యా ఇది అనివార్య చర్యగా భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రక్షణ శాఖ సమన్వయంతో ఈ ఎయిర్పోర్టులు మూసివేసినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను పునర్విమర్శించుకోవాలని, విమానయాన సంస్థల నుండి తాజా సమాచారం తెలుసుకోవాలని అధికారిక వర్గాలు సూచించాయి. భద్రతా పరంగా ఇది దేశానికి కీలక సమయంగా పేర్కొంటున్నారు.
Read Also : KTR: ఆపరేషన్ సిందూర్ పై స్పందించిన కేటీఆర్