हिन्दी | Epaper
చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Air India Plane Crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి – ఎయిర్ ఇండియా ప్రకటన

Sudheer
Air India Plane Crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి – ఎయిర్ ఇండియా ప్రకటన

అహ్మదాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India Plane Crash) దేశాన్ని కలచివేసింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం వల్ల విమానం కుప్పకూలిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. విమానంలో 242 మంది ప్రయాణికులు (242 passengers) ఉన్నట్లు అధికారులు వెల్లడించగా, ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు. ఈ దుర్ఘటనలో 241 మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా, విమానం మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలడం తో అక్కడ కూడా 24 మంది వరకు మరణించారు.

బాధితుల వివరాలు

మృతుల్లో 169 మంది భారతీయులు, 52 మంది బ్రిటిష్ పౌరులు, 7 మంది పోర్చుగీస్, కొంతమంది కెనడియన్లు ఉన్నారు. విమాన సిబ్బందిలో 12 మంది కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. గర్భం దాల్చిన తల్లులు, చిన్నపిల్లలు, వ్యాపార ప్రయాణికులు, విద్యార్ధులు – ఇలా అన్ని వర్గాలవారు ఈ విమానంలో ఉన్నారు. ముఖ్యంగా 24 మంది మెడికల్ విద్యార్థుల మరణం ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలిచివేస్తోంది. విమానంలో ప్రాణాలతో బయటపడ్డ ఏకైక వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా గుర్తించారు.

ప్రభుత్వ స్పందన

ప్రమాదంపై ప్రధాని సహా పలువురు నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్ ఇండియా మరియు ఇతర అత్యవసర బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. మృతుల కుటుంబాలకు మానసిక, ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ విమాన ప్రమాదానికి గల అసలు కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అత్యాధునిక స్థాయిలో బ్లాక్‌బాక్స్ విశ్లేషణ ద్వారా పూర్తి వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.

Read Also : Air India : ఎయిర్ ఇండియా చివరి ప్రమాదం ఎప్పుడు జరిగిందో తెలుసా.. ?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870