26 additional trains during Sankranti.. South Central Railway

సంక్రాంతికి మరో 26 ప్రత్యేక రైళ్లు : ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

హైద‌రాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రాకపోకలు సాగిస్తోన్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్​కు అదనంగా కోచ్‌లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 16 కోచ్‌లతో నడుస్తోన్న విశాఖ-సికింద్రాబాద్‌-విశాఖ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా మరో 4 కోచ్‌లను జత చేసింది. అదనపు కోచ్‌లు జనవరి 11 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. మరో 4 కోచ్‌లు పెంచడం ద్వారా ప్రస్తుతం 1,128గా ఉన్న సీటింగ్‌ కెపాసిటీ 1,414కి చేరనుంది.

Advertisements
image
image

సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది. కొన్ని ప్రధాన స్టేషన్ల మధ్య మొత్తం 26 ప్రత్యేక రైళ్లను అదనంగా నడపాలని నిర్ణయించింది. ఈ రైళ్లు నేటి నుంచి (జనవరి 10) 17వ తేదీల మధ్యలో సర్వీసులు నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి చర్లపల్లి మధ్య పలు జన సాధారణ్​ రైళ్లను నడపనున్నారు.

ఈ అన్​రిజర్వ్​డ్​ స్పెషల్​ రైళ్లు చర్లపల్లి నుంచి విశాఖపట్నం స్టేషన్ల మధ్య నేటి నుంచి 17వ తేదీల్లో మొత్తం 16 జన సాధారణ్ రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. సికింద్రాబాద్​- అర్సికెరే (కర్ణాటక), బెంగళూరు – కలబుర్గి స్టేషన్ల మధ్య మరికొన్ని సర్వీసులు ఏర్పాటు చేశారు. ఈ అదనపు ప్రత్యేక రైళ్లు సర్వీసులందించే తేదీలు, రూట్​ల వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పటికే రైల్వేస్టేషన్లు అన్నీ రద్దీగా మారాయి. ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయటంతో ప్రయాణికులకు కొంత ఊరట లభిస్తోంది. అయితే రద్దీ దృష్టిలో పెట్టుకుని మరిన్ని రైళ్లు ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Related Posts
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
AP Cabinet Decisions

అమరావతిలోని సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా జరిగింది. మంత్రివర్గంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కూలంకషంగా చర్చ జరగ్గా.. కొన్ని విషయాల్లో సీఎం చంద్రబాబు మంత్రులకు Read more

సైబరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసిన పోలీసులు..
police

సైబరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి నానక్‌రామ్‌గూడలో 12 మందికి పైగా ట్రాన్స్‌జెండర్లు ప్రజలతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అరెస్టు చేశారు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు Read more

Donald Trump: ట్రంప్ తొలి విదేశీ పర్యటన.. ఎక్కడికంటే?
Trump first foreign trip.. from where?

Donald Trump: విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చెపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌ తొలి విదేశీ పర్యటన ఇది. వచ్చే Read more

‘తండేల్’ ఫైనల్ కలెక్షన్లు ఎంతంటే
ఓటీటీ లోకి తండేల్ డేట్ ఖరారు.

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘తండేల్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో Read more