perni nani

హైకోర్టులో పేర్నినానికి ఊరట

ఏపీలో సంచలనం సృష్టించిన బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానికి హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి పేర్నినాని వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈనెల (జనవరి) 20కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు తొందరపాటు చర్యలు వద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్‌ బియ్యం అమ్ముకున్న ఘటనలో ఏ6గా పేర్నినాని ఉండగా, ఏ1గా పేర్నినాని సతీమణి జయసుధ ఉన్నారు. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలను టార్గెట్ చేస్తున్నది. వారిపై అక్రమ కేసులను పెట్టి జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది.

గోడౌన్ మొత్తం కూడా జయసుధ పేరుమీద ఉండటంతో మొదటి నుంచి ఈ కేసులో జయసుధ ఉన్నారు. అయితే ఏ6గా పేర్నినాని చేర్చారు పోలీసులు. ఈ విషయం తెలిసిన వెంటనే పేర్నినాని హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. నిన్న ఈ కేసుపై విచారణ జరుగగా.. నేటికి వాయిదా వేసింది హైకోర్టు. ఈరోజు మరోసారి పేర్నినాని పిటిషన్‌పై హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. జనవరి 20 వరకు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

Related Posts
MLC : ఏపీలో ఏడుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగింపు
Term of office of MLCs

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏడుగురు సభ్యుల ఆరేళ్ల పదవీకాలం ముగిసింది. ఈ మేరకు మండలి వారికి అధికారికంగా వీడ్కోలు పలికారు. పదవీ కాలం ముగిసిన సభ్యుల్లో ప్రముఖులు యనమల Read more

శైలజానాథ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్..
Jagan invited Shailajanath wearing a party scarf

అమరావతి: మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ వైసీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలోకి చేరారు. కండవా కప్పి Read more

అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగం తో ఈ సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈ సమావేశాలకు మాజీ సీఎం జగన్ సహా Read more

మాజీ ఎంపీ నందిగం సురేష్‌కు బెయిల్
ysrcp mp nandigam suresh satirical comments on pawan kalyan jpg

వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశకు హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. అయితే Read more