సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య

సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య

దాయాది పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద కవ్వింపు చర్యలకు దిగింది. పూంఛ్ జిల్లాలో కృష్ణ ఘాటి సెక్టార్‌లో భారత పోస్ట్‌లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడటంతో ఇండియన్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. పాక్ దుశ్చర్యను సమర్థంగా తిప్పికొట్టంతో దాయాది సైన్యం వెనక్కి తగ్గి.. తోకముడుచుకుని పారిపోయింది. నాలుగేళ్ల కిందట ఫిబ్రవరి 25, 2021న ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దుల్లో దాడులు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాది పాక్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే మొదటిసారి.

Advertisements

భారత సైన్యం ధీటైన బదులిచ్చింది
తాజా పరిణామాలతో సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు పెరిగడంతో భారత సైన్యం నిఘాను పటిష్టం చేసింది. దాయాది సైన్యానికి తగిన గుణపాఠం చెప్పేందుకు సరిహద్దులకు అదనపు బలగాలను తరలిస్తోంది. భారత సైనికులే లక్ష్యంగా కంచె దగ్గర ఐఈడీని అమర్చినట్టు సైనికలు వర్గాలు తెలిపాయి. బుధవారం పూంచ్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు చోటుచేసుకుని ఒక సైనికుడు గాయపడ్డాడని వర్గాలు పేర్కొన్నారు.. తార్కుండి ప్రాంతంలోని ఫార్వర్డ్‌ పోస్ట్‌పై.. పాక్‌ ఆర్మీ జరిపిన కాల్పులను భారత బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయి. తాజాగా, పాక్ ఆర్మీ దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం బదులిచ్చి దాయాదికి భారీ నష్టం కలిగించింది. అటువైపు పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.

సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య
సరిహద్దుల్లో మరోసారి పాక్ దుశ్చర్య

చొరబాటుకు యత్నం
మరోవైపు, గతవారం భారత్ ఫార్వర్డ్‌ పోస్టుపై దాడికి యత్నించిన ఏడుగురు చొరబాటుదారులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. కాల్పుల్లో హతమైన వారిలో ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ సైన్యానికి చెందిన జవాన్లు ఉన్నారని భావిస్తున్నట్లు సైనిక వర్గాలు వెల్లడించారు. నలుగురు అల్‌-బదర్‌ ఉగ్రవాద సంస్థకు ముష్కరులుగా అనుమానిస్తున్నారు. పూంచ్‌ జిల్లాలో ఫిబ్రవరి 5 మంగళవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత చొరబాటుకు అనుమానితు ఉగ్రవాదు యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భారత సైన్యం.. మెరుపువేగంతో స్పందించింది. అనుమానితులపై కాల్పులు జరిపి వారిని మట్టుబెట్టింది.

సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు

  • భారత సైన్యం నిఘాను మరింత కట్టుదిట్టం చేసింది
  • సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది
  • భారత సైనికులపై పాక్ ఐఈడీ అమర్చినట్లు నివేదికలు
  • ల్యాండ్‌మైన్ పేలుడులో ఒక భారత జవాన్ గాయపడిన ఘటన

గత వారంలోనే పాక్ చొరబాటుదారుల ప్రయత్నం విఫలం

  • ఫిబ్రవరి 5న భారత సైన్యం ఏడుగురు చొరబాటుదారులను మట్టుబెట్టింది
  • మృతుల్లో పాక్ సైన్యానికి చెందిన జవాన్లు ఉన్నట్లు అనుమానం
  • నలుగురు అల్-బదర్ ఉగ్రవాద సంస్థకు చెందిన ముష్కరులు
  • బోర్డర్ యాక్షన్ టీమ్ (BAT) హస్తం ఉన్నట్లు అంచనా

Related Posts
ఎస్‌బీఐ లైఫ్ స్పెల్ బీ సీజన్ 14
SBI Life Spell Bee Season 14 copy

హైదరాబాద్‌ : భారతదేశం యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పెల్లింగ్ పోటీ, SBI లైఫ్ స్పెల్ బీ సీజన్ 14 , కోల్‌కతాలో ఉత్కంఠభరితమైన గ్రాండ్ ఫినాలేతో ముగిసింది. Read more

Apple: ఆపిల్ కీలక నిర్ణయం ..శక్తివంతమైన తయారీ కేంద్రంగా భారత్!
ఆపిల్ కీలక నిర్ణయం ..శక్తివంతమైన తయారీ కేంద్రంగా భారత్!

రాత్రికి రాత్రే అమెరికాకు 15 లక్షల ఐఫోన్స్.. ఆపిల్ కీలక నిర్ణయం..ఎందుకో తెలుసా..ప్రపంచంలోని అతిపెద్ద టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన ఆపిల్, ఇప్పుడు భారతదేశంలో తయారైన ఐఫోన్‌లను నేరుగా Read more

ఐఈఈఈ జీఆర్ఎస్ఎస్ ఎస్ వై డబ్ల్యు 2024 ను నిర్వహించిన కెఎల్‌హెచ్‌ అజీజ్ నగర్
KLH Aziz Nagar organized IEEE GRSS SYW 2024

న్యూఢిల్లీ : హైదరాబాదులోని కెఎల్‌హెచ్‌ డీమ్డ్ టు బి యూనివర్సిటీ, ఐఈఈఈ జియోసైన్స్ మరియు రిమోట్ సెన్సింగ్ సొసైటీ (జీఆర్ఎస్ఎస్) స్టూడెంట్ , యంగ్ ప్రొఫెషనల్ మరియు Read more

Melinda Gates: సంతోషంగా ఉన్నాను మెలిండా గేట్స్ వెల్లడి
సంతోషంగా ఉన్నాను మెలిండా గేట్స్ వెల్లడి

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌తో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్న మెలిండా ఫ్రెంచ్ గేట్స్ మొదటిసారిగా తమ విడాకులపై స్పందించారు. బిల్ గేట్స్, Read more

Advertisements
×