Sunny Leone

సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ లబ్ది

ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ ను అక్కడి అధికారులు లబ్దిదారుగా ఎంపిక చేశారు. నెలనెలా ఆమె ఖాతాలో రూ. వెయ్యి జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ కు సంబంధం ఏంటి.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహిస్తున్నారా..? అక్కడి అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు.
మోసానికి పాల్పడ్డ వీరేంద్ర జోషి
దరఖాస్తులను చూశారో లేదో, లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచకా సంతకాలు పెట్టేశారో కానీ సన్నీ లియోన్ పేరు మాత్రం లబ్దిదారుల జాబితాలో చేరింది. నెలనెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమచేస్తోంది. బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ సర్కారు వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
నకిలీ ఖాతా
ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నీ లియోన్ పేరు, ఫొటో లతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా.. అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు. కాగా, ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహతారి వందన యోజన లబ్దిదారుల్లో దాదాపు సగం మంది ఫేక్ అని ఆరోపిస్తోంది.

Related Posts
భరత్ లో కీలక మలుపులు: మారుతున్న రాజకీయ సమీకరణాలు
భరత్ లో కీలక మలుపులు: మారుతున్న రాజకీయ సమీకరణాలు

బీహార్ రాజకీయాల్లో ఉత్కంఠ బీహార్ రాజకీయాలు ప్రస్తుతం మరింత ఆసక్తికరంగా మారాయి. 2025లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన Read more

ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం..!
Jamili Bill

న్యూఢిల్లీ: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుంది. అయితే Read more

ముంబైలో 113 మరియు 103 ఏళ్ల వృద్ధుల ఓటు హక్కు: యువతరానికి సందేశం
MAHARASTHRA ELECTION

ముంబైలో ఓటు హక్కును వినియోగించిన ఇద్దరు వృద్ధుల కథ మనసును హత్తుకుంది. 113 ఏళ్ల వృద్ధురాలు నేపియన్ సముద్ర రోడ్డు నుండి, మరియు 103 ఏళ్ల వృద్ధుడు Read more

నిర్లక్ష్యానికి 13 నిండు ప్రాణాలు బలి
mumbai boat accident

ముంబై తీరంలో జరిగిన దారుణ బోటు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం కలచివేస్తోంది. నీల్కమల్ ఫెర్రీ బోటు ప్రమాదానికి ప్రధాన కారణం నిర్లక్ష్యమే అని Read more