230804 Rahul Gandhi mjf 1459 53615f

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యానించారు. ఏకలవ్యుని బొటనవేలు తీసుకుని ద్రోణుడు అతడిని విలువిద్యకు దూరం చేసినట్లే.. ప్రభుత్వం ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తోందనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత జీవితాలతో ఆటలు వద్దు
కేంద్ర ప్రభుత్వ విధానాలు యువత జీవితాలతో ఆడుకుంటున్నదని, అనేకులు నిరాశలో జీవిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేసారు. ‘సైన్యంలోకి అగ్నివీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను నరికేశారు. ఏకంగా 70 పరీక్షల పేపర్‌ లీకేజీలు జరిగినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను తెగగొట్టారు. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ బయట దేశ రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. లాఠీచార్జి చేస్తున్నారు. రైతులు మిమ్మల్ని కనీస మద్దతు ధర కల్పించమని కోరుతున్నారు. తమ పంటకు తగ్గ ధర కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం అదానీ, అంబానీలకు లాభాలు కట్టబెట్టి రైతుల బొటన వేళ్లను నరికేశారు’ అని రాహుల్ గాంధీ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మేం దేశ ప్రజలకు అభయముద్ర గురించి చెబుతున్నాం. భయం వద్దు, ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నాం. మీరు మాత్రం వారి బొటన వేళ్లను నరికేస్తాం అంటున్నారు. మీకూ, మాకు ఉన్న తేడా అదే’ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ కనిపించారు. శుక్రవారం తొలిసారి లోక్‌సభలో ప్రసంగించిన ప్రియాంకాగాంధీ కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Related Posts
Chiranjeevi : సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు
Chiranjeevi: సునీత రాకపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

రోదసి నుంచి భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్ అంతరిక్షయాత్రికురాలు సునీతా విలియమ్స్, వ్యోమగామి బుచ్ విల్మోర్ సహా నలుగురు వ్యోమగాములు 9 నెలల పాటు అంతరిక్షంలో Read more

IPL2025:క్షమాపణ చెప్పిన పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌..ఎందుకంటే!
IPL2025:క్షమాపణ చెప్పిన పంజాబ్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఎందుకంటే!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ తన తొలి మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన కనబరిచారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ Read more

కుప్పకూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి
The helicopter crashed in M 1

మహారాష్ట్రలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. పుణెలోని బవధాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాకు సమీపంలోని గోల్ఫ్ Read more

భారీగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
భారీగా ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు

ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో, దాదాపు 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో నూతన Read more