టాలీవుడ్ ఇండస్ట్రీలో అనుపమ పరమేశ్వరన్ అంటే ప్రేక్షకులకు తెలిసిందే. కుర్రాళ్ల అభిమానానికి కేరాఫ్ అడ్రెస్ అయిన ఆమె, తన ఉంగరాల జుట్టు, సుందరమైన రూపంతో మొదటి సినిమాతోనే సినీప్రియుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తెలుగులో ఆమె నటించిన అనేక సూపర్ హిట్ సినిమాలు ఆమె ప్రతిభను నిరూపించాయి. కానీ ప్రస్తుతం అనుపమ, ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించినప్పటికీ, ప్రస్తుతం సినిమాల్లో కొంత స్లో అయ్యింది.తాజాగా ఆమె “టిల్లు స్క్వేర్” చిత్రంతో తిరిగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమాలో గ్లామర్ బ్యూటీగా కనిపించి, కుర్రాళ్లకు షాకిచ్చింది.అయితే ఈ సినిమా తరువాత ఆమె ఫిల్మ్ జర్నీ కొంత మందగించింది. ప్రస్తుతం అనుపమ, “పరదా” అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.సోషల్ మీడియా లో కూడా చాలా యాక్టివ్ గా ఉండే అనుపమ, ఇటీవల ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసింది. “ఐ లవ్ యూ ఎప్పటికీ” అని చెప్పడం అతి పెద్ద అబద్ధమని, ట్యాక్సీ ప్రేమ నుంచి పారిపోవాలని ప్రేమికులకు సలహా ఇచ్చింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.అనుపమ పరమేశ్వరన్ 1996 ఫిబ్రవరి 1996లో కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు.
2015లో “ప్రేమమ్” చిత్రంతో సినీ రంగంలో అడుగుపెట్టారు.ఆ తర్వాత తమిళం, తెలుగులో వరుస ఆఫర్లు అందుకుని, తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించారు. అనుపమ ప్రస్తుతం తెలుగులో “పరదా” అనే సినిమాతో నటిస్తున్నారు.అలాగే తమిళంలో “మరిసెల్వరాజ్” దర్శకత్వంలో “బైసన్” చిత్రంలో, “డ్రాగన్” చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.ఇంకా, ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన పోస్ట్‌లో “నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తాను అన్నది ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధం. ఎప్పుడూ అలసిపోయే ట్యాక్సీ ప్రేమను వదిలేసి అలాంటి ప్రేమకు దూరంగా పారిపో” అని రాసుకొచ్చింది. ప్రేమమ్ సినిమాలోని సాయి పల్లవి పాత్రను అనుపమ చాలా ఇష్టపడతానని పేర్కొన్నారు.