మహా కుంభమేళా కి వచ్చిన జనం 66 కోట్ల 26 లక్షలు

మహా కుంభమేళా కి వచ్చిన జనం 66 కోట్ల 26 లక్షలు

ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న మహా కుంభమేళ వైభవ ఘట్టం ముగిసింది. ముందుగా అనుకున్న అంచనాలను తారుమారు చేస్తూ లెక్కకు మించిన భక్తులు పుణ్యస్నాల కోసం ప్రయాగరాజుకు తరలి వచ్చారు. ముందుగా అనుకున్న ప్రకారం 45 కోట్ల మంది వరకు వస్తారని అనుకుంటే, దానిని మించి సుమారుగా 66 కోట్ల 21 లక్షల మంది భక్తులు పుణ్యస్నాలు ఆచరించారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్బంగా సుమారుగా మూడు లక్షల కోట్ల రూపాయల విలువైన వ్యాపారం జరిగింది.

Advertisements

మహా కుంభమేళ యొక్క వైభవం

ప్రపంచ దేశాలన్నీ కూడా ఉత్తరప్రదేశ్ లో ప్రయాగరాజులో జరిగిన మహా కుంభమేళ పై దృష్టి సారించారు. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళ శివరాత్రి రోజు 26 ఫిబ్రవరి తో ముగిసింది. ఈ జన సందోహం ప్రయాగరాజుకు దారి తీసింది. ఎక్కడి నుంచి చూసినా దేశంలో నలుమూలల నుండి భక్తులు ప్రయాగరాజుకు తరలి వెళ్లారు. ఒక దేశం నుంచే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల నుండి భక్తులు ప్రత్యేక విమానాల్లో తిరిగి రావడం జరిగింది.

అభివృద్ధి మరియు సేవలు

ప్రయాగరాజులో సుమారుగా 4000 ఎకరాల్లో లక్షకు పైగా టెంట్లను ఏర్పాటు చేసి, భక్తులు అక్కడ చేత తీరడానికి అవకాశం కల్పించారు. అంతేకాదు, సుమారుగా 10000 బస్సులు, 5000 రైళ్లు, 1000 విమానాలు ప్రత్యేక సర్వీసులు నిర్వహించి, భక్తులను ప్రయారాజుగా చేర్చడానికి మరి తీసుకెళ్లడానికి సేవలు అందించాయి.

భక్తుల దృశ్యం

ఈ 45 రోజులలో ప్రతి రోజు ఒక అద్భుత ఘట్టం అక్కడ ఆవిష్కరించబడింది. జనవరి 13న ఒక పుణ్యస్నం, జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా మరో పుణ్యస్నం, జనవరి 29న మౌని అమావాస్య రోజున మరో పుణ్యస్నం ఆచరించారు. ఫిబ్రవరి 3rd తేదీన వసంత పంచమి సందర్భంగా కోట్లాది జనం తరలి వచ్చారు. చివరి పుణ్యస్నం ఏదైతే ఉందో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి నాడు నిర్వహించారు.

మార్పులు మరియు అభివృద్ధి

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి యువత ఎక్కువ సంఖ్యలో అక్కడ కనిపించారు. యువత ఈ ఈ అవకాశాన్ని ప్రయారాజులో గంగా యమున సరస్వతి సంగమంలో స్నానాలు చేయడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. ఒక పక్క సన్యాసులు అకాడాలు వస్తుంటే, మరో పక్క యువత లాప్టాప్లు, సెల్ ఫోన్లు పట్టుకొని రావడం ఒక రకమైన ప్రత్యేకతను అక్కడ మనకు కనిపించింది.

ఉత్సవానికి అంతర్జాతీయ దృష్టి

ప్రపంచంలోని దేశాలు, మీడియా మొత్తం ఈ మహా కుంభమేళ పై దృష్టి సారించాయి. ఈ 45 రోజులు ట్రెండింగ్ ఏదైతే నడిచిందో, మహా కుంభమేళ మాత్రమే అని చెప్పేసి మనకు స్పష్టం అవుతుంది. Google సెర్చ్ లో గాని, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో మొత్తం కూడా ఈ మహా కుంభమేళ కోసమే కొనసాగింది.

భక్తుల ఆకర్షణ

మహా కుంభమేళా కి వచ్చిన జనం 66 కోట్ల 26 లక్షలు అంటే మన దేశం నుంచి సగం మంది హిందువులు ఆ పుణ్యస్నాల కోసం తరలినట్లుగా కణాంకాలు చెబుతున్నాయి. మరో పక్క విదేశాల నుండి గతంలో ఎన్నడూ ఊహించని విధంగా యాత్రికులు తరలి వచ్చారు.

ముగింపు

మొత్తంగా, మహా కుంభమేళ ప్రతి ఒక్కరి గుండెల్లో ఆ ఆధ్యాత్మిక భావనను కలిగించింది. 66 కోట్ల 26 లక్షల మంది భక్తులు ఈ మహా కుంభమేళలో పాల్గొని, తమ ఆధ్యాత్మిక పతకాలను సంతరించుకున్నారు.

Related Posts
హత్యా లేక ఆత్మహత్యా? సుశాంత్ – దిశా కేసుల్లో కొత్త ట్విస్టులు
హత్యా లేక ఆత్మహత్యా

హత్యా లేక ఆత్మహత్యా? సుశాంత్ - దిశా కేసుల్లో కొత్త ట్విస్టులు హత్యా లేక ఆత్మహత్యా? ఈ రెండు మాటలే ఇప్పుడు మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ముగ్గురు Read more

Tariff పోరాటం : ట్రంప్ టారిఫ్ పోరాటం – ప్రపంచ దేశాలు, భారత్ మరియు అమెరికాకు పడే ప్రభావాలు
టారిఫ్ పోరాటం

ట్రంప్ టారిఫ్ పోరాటం: ఒక పరిచయం ట్రంప్ టారిఫ్ పోరాటం ప్రారంభం నుండి చాలా దేశాలకు, ముఖ్యంగా మన దేశం భారతదేశానికి, తీవ్రమైన ప్రభావాలు చూపిస్తుంది. ట్రంప్ Read more

BPH అంటే ఏంటి
BPH అంటే ఏంటి

BPH అంటే ఏంటి? BPH అంటే ఏంటి అని చాలామంది సందేహపడతారు. ఇది బెనైన్ ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా (Benign Prostatic Hyperplasia) అనే వైద్యపరమైన స్థితి, Read more

ఒక్కటైన దక్షిణ రాష్ట్రాలు
దక్షిణ రాష్ట్రాలు

డిలిమిటేషన్ పై దక్షిణ రాష్ట్రాలు ఆందోళన ఎందుకు? దక్షిణ రాష్ట్రాలు డిలిమిటేషన్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అసలు డిలిమిటేషన్ అంటే ఏమిటి? ఎందుకు దక్షిణ Read more

×