Foundation stone laying ceremony for CM Chandrababu house in Amravati tomorrow

CM Chandrababu : అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు ఇంటికి శంకుస్థాపన

CM Chandrababu : ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని అమ‌రావ‌తిలో తన సొంతింటి నిర్మాణానికి రేపు( బుధవారం) శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 8.51 గంటలకు సీఎం కుటుంబ సభ్యులు భూమి పూజ చేస్తారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు కుటుంబానికి వెలగపూడి గ్రామస్థులు పట్టువస్త్రాలు అందించనున్నారు. రాజధానిలో సొంతింటి నిర్మాణం కోసం చంద్రబాబు కుటుంబం రైతుల నుంచి ఐదెకరాల భూమి కొనుగోలు చేసింది.

Advertisements
 అమరావతిలో రేపు సీఎం చంద్రబాబు

చంద్రబాబు సొంతిల్లు కట్టుకుంటుండటంతో రైతుల్లోనూ నమ్మకం

రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు నివాసం ఏర్పాటు చేసుకోవడం పట్ల ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. 2014లో రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత, చంద్రబాబు నాయుడు పాలనను ఇక్కడి నుంచే కొనసాగించారు. అయితే, రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన ఆయన సొంతిల్లు నిర్మాణం గురించి పెద్దగా పట్టించుకోలేదు. చంద్రబాబు సొంతిల్లు కట్టుకుంటుండటంతో రాజధాని రైతుల్లోనూ నమ్మకం పెరిగింది. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు గత ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వయంగా ఇల్లు నిర్మించుకుంఉటండడంతో తమకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నారు.

సొంతిల్లు నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా

2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, అమరావతిని దేశంలోనే అగ్రగామి రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ క్రమంలోనే నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభించి, నిర్మాణాలను వేగవంతం చేశారు. ఇప్పుడు సొంతిల్లు నిర్మాణం చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించనున్నారు. రాజధాని ఎంపిక నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యానికి చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు.

Read Also: ఏపీకి గుడ్ న్యూస్.. రాష్ట్రంలో రూ.80 వేల కోట్లతో రిఫైనరీ

Related Posts
Warning : భూ దందాలు చేస్తే సహించేది లేదు – పవన్
PAWAN KALYAN a1bbb2a819

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భూముల కబ్జాలు, తప్పుడు దస్తావేజుల Read more

ప్రపంచ బ్యాంక్ చీఫ్ జోక్: మోదీ, మాక్రాన్‌ల మధ్య స్నేహపూర్వక వాతావరణం
india french

ప్రపంచ బ్యాంక్ చీఫ్ అజయ్ బంగా , బ్రెజిల్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో ప్రపంచ నాయకులను నవ్వులతో ఆకట్టుకున్నారు. ఆయన "ఒక భారతీయుడి నుండి మరొకరికి" Read more

సౌదీ అరేబియాలో చిక్కుకున్న శ్రీకాకుళం యువకులు..
Srikakulam youth trapped in Saudi Arabia

సౌదీ అరేబియాలో ఉపాధి కోసం వెళ్లిన శ్రీకాకుళం జిల్లా యువకుల అవస్థలు.. శ్రీకాకుళం : సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, పలాస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళి మండలాలకు Read more

నేడు పల్నాడుకు సీఎం చంద్రబాబు పర్యటన
Chandrababu's visit to tirupathi from today

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నరసరావుపేట నియోజకవర్గం యలమందల గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×