Kejriwal will waive the increased water bill after coming back to power

మళ్లీ అధికారంలోకి వచ్చాక పెరిగిన వాటర్‌ బిల్లు మాఫీ చేస్తా: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: రానున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ తిరిగి అధికారంలోకి రాగానే పెరిగిన నీటి బిల్లులను మాఫీ చేస్తామని ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ ముఖ్యమంతి అరవింద్‌ కేజ్రీవాల్ తెలిపారు. వాజీపూర్‌లో నిర్వహించిన పాదయాత్రలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. తనను మరోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే, గతంలో విడుదలైన నీటి బిల్లులను మాఫీ చేస్తానని ఢిల్లీ ప్రజలకు హామీ ఇచ్చారు. నీటి బిల్లులు అధికంగా ఉన్నవారికి చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఫిబ్రవరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు తరువాత, మార్చిలో వచ్చే వాటర్ బిల్లులను మాఫీ చేస్తామని పేర్కొన్నారు. బీజేపీకి ఓటు వేస్తే, తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యుత్ మరియు నీటికి సంబంధించిన పథకాలు నిలిపివేస్తాయంటూ హెచ్చరించారు.

మరోవైపు కేజ్రీవాల్ వ్యాఖ్యలపై ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్‌దేవా ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిని పసిగట్టిన మాజీ ముఖ్యమంత్రి తన ప్రకటనల ద్వారా ప్రజల మనసుల్లో భయాన్ని నింపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వాలు అత్యుత్తమ సామాజిక సంక్షేమ రాయితీలు ఇస్తున్నాయని ప్రజలకు బాగా తెలుసు. విద్యుత్ సబ్సిడీ కొనసాగుతుందని, దాని ప్రయోజనం మధ్యతరగతి వినియోగదారులకు కూడా వర్తిస్తుందని తాము పదేపదే చెబుతున్నామని సచ్‌దేవా చెప్పారు. “మేము స్వచ్ఛమైన నీటిని కూడా సరఫరా చేస్తాము,” ఆయన అన్నారు.

Related Posts
దావోస్ : ఒకే వేదికపై ముగ్గురు సీఎంలు
Babu With Fellow CMs In Dav

దావోస్‌లో జరిగిన 'కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్' సమావేశంలో ఒకే వేదికపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర Read more

Yediyurappa: మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు – హైకోర్టు స్టే
మాజీ సీఎం యడియూరప్పపై పోక్సో కేసు – హైకోర్టు స్టే

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పపై మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు Read more

దావోస్ పర్యటన వివరాలు పంచుకున్న శ్రీధర్ బాబు
sridhar started tea fiber s

తెలంగాణ ప్రభుత్వం దావోస్ సదస్సులో పాల్గొన్నదుకు అనూహ్యమైన విజయాలు సాధించిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. గత ఏడాది కంటే ఈసారి నాలుగు రెట్లు ఎక్కువ ఒప్పందాలు Read more

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
mahadharna-postponed-in-nallagonda

హైదరాబాద్‌: ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభమైన కాసేపటికే బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనపై వాయిదా తీర్మానం కోరడంతో పాటు తాజాగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆందోళన Read more