manipur cm

మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు కలకలం

ఏడాదిగా మణిపూర్ లో జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణతో వందలాది మంది చనిపోయారు. అనేకులు తమ నివాసాలను కోల్పోయారు. రాష్ట్రం ఏడాదిగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. బీరేన్ సింగ్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో ఈ తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబును గుర్తించిన సమయంలో బీరేన్ సింగ్ నివాసంలో లేరని తెలుస్తోంది.
మణిపూర్ లో గత కొంత కాలంగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనీ ఆ పార్టీ వారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉండొచ్చని… అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related Posts
Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి
Israel గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి

Israel : గాజాలో ఇజ్రాయెల్ దాడుల్లో ఒసామా టబాష్ మృతి తాజాగా గాజాలో హమాస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది.హమాస్ సైనిక నిఘా విభాగానికి అధిపతిగా Read more

మారిష‌స్‌ చేరుకున్న ప్ర‌ధాని మోడీ
Prime Minister Modi arrives in Mauritius

న్యూఢిల్లీ: ప్ర‌ధాని మోడీ రెండు రోజుల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు మారిష‌స్ చేరుకున్నారు. ఈ నేప‌థ్యంలో పోర్టు లూయిస్ విమానాశ్ర‌యంలో ఆయ‌నకు ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. మారిష‌స్‌లో Read more

మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
మైక్రోసాఫ్ట్ కొత్త భవనాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లో తమ క్యాంపస్ ను విస్తరించింది. గచ్చిబౌలిలో 1.1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో కొత్త Read more

Narendra Modi:దేశ ఐక్యతను దెబ్బతీసే వారి కుట్రలను సాగనివ్వబోమన్న ప్రధాని
narendra modi

దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ అమలులోకి రాకుండా తమ ప్రభుత్వం కట్టుబాటుగా Read more