foodvikarabad

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

భోజనం వికటించి అస్వస్థతకు గురైన విద్యార్థినిలు

-15 మంది విద్యార్థినులను ఆసుపత్రి కి తరలింపు

— తాండూరు గిరిజన వసతిగృహంలో ఘటన

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ప్రభాతవార్త: వికారాబాద్ జిల్లా తాండూరులోని వసతి గృహంలో భోజనం వికటించి విద్యార్థినిలు అనుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని సాయిపూర్లో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా హాస్టల్ భోజనంలో నాణ్యత లోపించిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అన్నంలో పురుగులతో పాటు అడ్డదిడ్డంగా వంటకాలు చేస్తున్నారని, పరిశుభ్రత పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించాడు. నీళ్ళ వారు తప్ప ఇతర కూరగాయల రుచి ఎరుగమని, కిచెన్లో సైతం అపరిశుభ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి వండిన భోజనం తినలేకపోయామని వాపోయారు. భోజనం తిన్న విద్యార్థులు వాంతులు చేసుకొని అస్వస్థతకు గురయ్యావని, హాస్టల్ టీచర్ మంగళవారం తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అస్వస్థతకు గురైన వారిని తరలించినట్లు విద్యార్థినులు తెలిపాడు. దాదాపు 15 మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారని పేర్కొన్నారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థినిల తల్లిదండ్రులు ఫుడ్ పాయిజన్ పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పంధించి తగు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Posts
కూలిన యుద్ధ విమానం.. పైలట్లకు గాయాలు
Crashed fighter plane.. Injuries to the pilots

శివపురి: మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన Read more

రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

Revanth Reddy: మీడియాపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Revanth Reddy: మీడియాపై ఘాటుగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి – అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ మీడియా బాధ్యతలపై ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర ఎంతో కీలకం అని ఆయన గుర్తు చేస్తూ, గౌరవంగా, Read more

సుంకాల తగ్గింపు చర్యలు నిజమే..కానీ ఒత్తిడితో కాదు : భారత్‌
Tariff reduction measures are real...but not under pressure

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల మాట్లాడుతూ..భారత్ అత్యధికంగా సుంకాలు వసూలు చేస్తుందన్న అంశాన్ని తాను బహిరంగంగా లేవనెత్తడం వల్లే.. ఆ దేశం ఆందోళన చెంది Read more