సల్మాన్ ఖాన్ మోస్ట్ అవేటెడ్ మూవీ సికందర్ టీజర్ రిలీజ్ అవడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. మన్మోహన్ సింగ్ ఆకస్మిక మరణం కారణంగా ముందుగా ప్లాన్ చేసిన టీజర్ రిలీజ్ వాయిదా పడింది.ఈ వార్తను మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ, టీజర్‌ను మరుసటి రోజు విడుదల చేస్తామని ప్రకటించారు.ఇప్పుడు, టీజర్ ప్రేక్షకుల ముందుకు రాగా,సల్మాన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.సికందర్ టీజర్‌లో సల్మాన్ ఖాన్ తన స్టైల్ లుక్స్, పవర్‌పుల్ యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నారు.ఈ టీజర్‌లో ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను మరోసారి కట్టిపడేస్తోంది.ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్‌పై అభిమానులు తమ ఆనందాన్ని పంచుకుంటూ, సల్మాన్ ఖాన్ రూల్స్ ద స్క్రీన్, అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు.

సినిమాలో రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. రష్మిక మందన్నా గ్లామర్‌తో పాటు తన నటనతో మరోసారి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటుందనే నమ్మకంతో ఉంది. అలాగే, కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో తన సొగసుతో, చక్కటి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. సికందర్ సినిమా రిలీజ్ కోసం సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. టీజర్ చూసిన తర్వాత వారు సినిమాపై మరింత ఉత్సాహంతో ఉన్నారు.ఈ సినిమా థియేటర్లలో మాస్ హవా క్రియేట్ చేస్తుందనే నమ్మకం ఉంది, అని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.సల్మాన్ ఖాన్ ఇటీవల విడుదలైన బేబీ జాన్ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇప్పుడు సికందర్ చిత్రంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైన్మెంట్ అందించడానికి సిద్ధమవుతున్నారు.ఈ సినిమా ద్వారా సల్మాన్ తన అభిమానులకు నిజమైన ఇవ్వనున్నారని అనుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ స్టన్నింగ్ లుక్స్, హై-అక్టివ్ యాక్షన్ సీన్స్ బీజీఎమ్ ఆకట్టుకునేలా ఉంది, అద్భుతమైన విజువల్స్‌తో టీజర్ ముస్తాబైంది.రష్మిక, కాజల్ పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సికందర్ విడుదల తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ, ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతో సల్మాన్ ఖాన్ మరో బ్లాక్‌బస్టర్ అందిస్తారనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనున్న సికందర్ టీజర్‌తో, సినిమా విడుదలకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.