పాకిస్థాన్ కు అమెరికా షాక్

పాకిస్థాన్ ప్రభుత్వానికి అగ్రరాజ్యం అమెరికా షాకిచ్చింది. పాక్ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు నాలుగు కీలక సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి సాంకేతికత వ్యాప్తికి సహకరిస్తున్నాయని, సామూహిక జన హనన ఆయుధాల తయారీకి సాయపడుతున్నాయని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ (ఎన్‌ డీసీ) కూడా ఉంది. ఇది పాక్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ కార్యక్రమానికి సహకరిస్తోందని ఆరోపించింది.
నాలుగు కంపెనీలపై ఆంక్షలు
ఇది సామూహిక జనహనన ఆయుధాలను వ్యాప్తి చేస్తోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పాక్ నేషనల్‌ డెవలప్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సహా నాలుగు కంపెనీలపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. దీంతో పాటు కరాచీ కేంద్రంగా పనిచేస్తున్న అక్తర్‌ సన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, అఫిలియేట్స్‌ ఇంటర్నేషనల్‌, రాక్‌సైడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కూడా ఈ జాబితాలో ఉన్నాయి. క్షిపణి ప్రయోగానికి వినియోగించే పరికరాలను ఎన్ డీసీ కొనుగోలు చేస్తోందని, షాహిన్‌ శ్రేణి క్షిపణుల తయారీలో చురుగ్గా పాల్గొందని అమెరికా వెల్లడించింది. ఈ పరికరాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను ఎన్ డీసీకి అక్తర్‌ అండ్‌ సన్స్‌ సంస్థ సరఫరా చేస్తోందని తెలిపింది.
అమెరికా పక్షపాతధోరణి: పాక్ ఆరోపణ
ఎన్ డీసీ తరఫున మిసైల్ లో వినియోగించే పలు పరికరాలను అఫిలియేట్‌ ఇంటర్నేషనల్‌ కొనుగోలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాథ్యూమిల్లర్‌ చెప్పారు. కాగా, తమ సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడం దురదృష్టకరమని, పక్షపాతంతో కూడుకున్నవని పాక్ ప్రభుత్వం పేర్కొంది. అమెరికా మరోసారి పునరాలోచించాలి పాక్ కోరుతున్నది.

Advertisements
Related Posts
సిరియాలో ఉగ్రవాదం అరికట్టేందుకు ఇజ్రాయిల్ చర్యలు..
israel syria

ఇజ్రాయిలి సైనికులు సిరియాలో ప్రగతిని సాధించి, గోలన్ హైట్స్ ప్రాంతంలోని డెమిలిటరైజ్డ్ జోన్‌ను ఆక్రమించారు. ఈ చర్య తరువాత, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నతన్యాహూ, "సిరియాలో ఉగ్రవాద Read more

Canada: కెనడాలో మధ్యంతర ఎన్నికలు
కెనడాలో మధ్యంతర ఎన్నికలు

కెనడాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేసి, లిబరల్ పార్టీ నాయకత్వం కొత్త Read more

SUDAN: సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి
సుడాన్​ అంతర్యుద్ధంలో 300మంది మృతి

ఆఫ్రికా దేశం సుడాన్​ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌​ దాడులతో అతలాకుతలమౌతోంది. డార్ఫర్ ప్రాంతంలో రెండు రోజులపాటు జరిగిన దాడుల్లో 300 మందికి పైగా పౌరులు మరణించారని ఐక్యరాజ్యసమితి Read more

ఎన్నికను ఒప్పుకుంటున్నాము కానీ పోరాటం ఆపడం లేదు : కమలా హ్యారిస్
kamala harris

2024 యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ చేతిలో ఓడిపోయిన కమలా హ్యారిస్ తన ఓటమిని ఆమోదిస్తూ, "మేము ఈ ఎన్నిక ఫలితాలను ఒప్పుకుంటున్నాం, కానీ పోరాటం Read more

Advertisements
×