fire crackers blast

పటాకుల పరిశ్రమలో పేలుడు.. ఆరుగురు మృతి

తరచుగా పటాకుల ఫ్యాక్టరీలో పేలుడు సంభవిస్తున్నా ప్రభుత్వం తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం అవుతున్నది. దీనితో అమాయకుల ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. తాజాగా తమిళనాడులోని విరుధునగర్‌ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. సత్తూర్‌ సమీపంలోని పటాకుల ఫ్యాక్టరీలో ఒక్కసారిగా పేలుడు చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. పటాకుల పేలుడు ధాటికి కార్మికులు కొన్ని మీటర్ల దూరం ఎగరిపడ్డారు. సమీపంలోని ఆరు ఇండ్లు ధ్వంసమయ్యాయి.


పోలీసులు సహాయక చర్యలు
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. ముగ్గురి మృతదేహాలను వెలికితీశామన్నారు.
కాగా, గతేడాది అక్టోబర్‌లో కూడా తిరువూరు జిల్లాలోని ఓ పటాకుల గోడౌన్‌లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వారిలో 9 నెలల చిన్నారి కూడా ఉన్నది. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి 10 ఇండ్లకుపైగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు.

Related Posts
Mohammed Yunus: జాతీయ దినోత్సవం సందర్భంగా యూనస్ కు మోడీ లేఖ
జాతీయ దినోత్సవం సందర్భంగా మహమ్మద్ యూనస్ కు మోడీ లేఖ

రాజకీయ అస్థిరతతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ నిన్న 53వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంది. ఈ సందర్భంగా ఆ దేశ తాత్కాలిక ప్రధాని మహమ్మద్ యూనస్ కు భారత ప్రధాని Read more

భారత వలసదారుల పట్ల అమానవీయ ప్రవర్తన

అమెరికాలో నివసించే అక్రమ వలసదారులు, వారిని తరలించిన విధానం దేశ రాజకీయాల్లో చిచ్చుపెట్టింది. దీనిపై కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్షాల ఉమ్మడి సంకీర్ణ కూటమి ఇండియా తీవ్ర అభ్యంతరాన్ని Read more

‘స్వర్ణిమ’ పేరుతో మహిళలకు కొత్త పథకం తీసుకొచ్చిన మోడీ సర్కార్‌
Modi government has brought a new scheme for women named Swarnima

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడీ మహిళలకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారు. వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన పథకాలను గతంలో కూడా Read more

సినీ ప్రముఖులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ భేటీ
సినీ ప్రముఖులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ భేటీ

సినీ ప్రముఖులతో మోడీ ఈ ఏడాది చివర్లో "వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ సమ్మిట్" (WAVES) ను నిర్వహించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు Read more