ఇటీవల కుటుంబ వివాదాల కారణంగా ప్రముఖ సినీనటుడు మోహన్ బాబు మీడియాలో తరచూ కనిపిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీకి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, ఆయన భార్య మౌనిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారని చెపుతున్నారు. జనసేనలో వారు చేరుబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. నంద్యాల నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అయితే ఈ ప్రచారంపై మనోజ్ కానీ, మౌనిక కానీ ఇంకా స్పందించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
కాగా సోమవారం మోహన్ బాబు హైదరాబాద్ నుంచి ఏపీలోని చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని తన యూనివర్సిటీకి వెళ్లారాయన. అనంతరం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో తన డబుల్ బ్యారెల్ లైసెన్స్‌డ్ గన్‌ను పీఆర్ఓ ద్వారా డిపాజిట్ చేయించారు. ఇటీవల కుటుంబ గొడవల నేపథ్యంలో గన్ సరెండర్ చేయాలని హైదరాబాద్ పోలీసులు ఆయన్ను ఆదేశించడంతో తాజాగా గన్ అప్పగించారు.
మంచు మనోజ, మౌనికలు జనసేన పార్టీలో చేరుతున్నట్లు వార్తలు రావడంతో మరోసారి ఈ ఫ్యామిలీ వార్తలో నిలిచింది.
జల్‌పల్లిలో తన నివాసం వద్ద జరిగిన ఘటనపై మోహన్ బాబు తాజాగా మరోసారి మాట్లాడారు. తాను ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టుపై దాడి చేయలేదన్నారు. ఈ సందర్భంగా మరోసారి జర్నలిస్టులను ఆయన క్షమాపణలు కోరారు. ఇక ఆదివారం నాడు దాడిలో గాయపడిన జర్నలిస్టును ఆసుపత్రికి వెళ్లి మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు పరామర్శించిన విషయం తెలిసిందే.