ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా “సూపర్ సిక్స్” పథకాలలో భాగంగా ఇప్పటికే ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారు. ఇక, 2025-26 బడ్జెట్‌లో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు యువత మరియు మహిళలకు సంబంధించి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలోనే అమలు చేయనున్న పథకాల గురించి అధికారికంగా వెల్లడించారు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రభుత్వ ప్రాధాన్యతలు, హామీల అమలు, తన విధానాలు తదితర విషయాలపై క్లారిటీ ఇచ్చారు.

డీఎస్సీ నోటిఫికేషన్
ఎన్నికల సమయంలో చంద్రబాబు డీఎస్సీ నోటిఫికేషన్ పై స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆ హామీని నెరవేర్చే దిశగా కీలక అడుగు వేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయం. SC వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యాక నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్‌లో మెగా DSC నోటిఫికేషన్ విడుదల. చంద్రబాబు మాట్లాడుతూ, ఉపాధ్యాయ నియామకాలు నిరుద్యోగ యువతకు పెద్ద ఊరట. విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఇది కీలకం, రానున్న రోజుల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాం అని హామీ ఇచ్చారు.
తల్లికి వందనం పథకం
తల్లికి వందనం పథకాన్ని మే నెలలో ప్రారంభించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ పథకం కింద ప్రతి పిల్లవాడికి తల్లుల ఖాతాలో ₹15,000 నగదు జమ చేయనున్నారు. స్వచ్ఛందంగా కుటుంబ పెంపకంపై దృష్టి పెట్టిన తల్లులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడడమే కాకుండా, తల్లులకు ఆర్థిక భద్రత కల్పించనున్నారు. చంద్రబాబు మరో కీలక ప్రకటన చేస్తూ పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. పీ4 – పేదరిక నిర్మూలనకు ప్రత్యేక ప్రణాళిక బంగారు కుటుంబం – ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను అభివృద్ధి చేసే స్కీమ్ సంపదను సృష్టించి, దానిని ప్రజల మధ్య సమంగా పంచడమే తన లక్ష్యం. చంద్రబాబు మాట్లాడుతూ, పేదరికం నిర్మూలన కోసం అందరూ ప్రభుత్వంతో కలిసి పని చేయాలి. ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అని స్పష్టం చేశారు. చంద్రబాబు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీని నాశనం చేయాలని ప్రయత్నించిన వారంతా కాలగర్భంలో కలిసిపోయారు. కానీ టీడీపీ శాశ్వతంగా కొనసాగుతుంది.” అని ధీమాగా చెప్పారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో టీడీపీ ఎప్పుడూ ముందుంటుంది అని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ ప్రకటనల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, పీ4, బంగారు కుటుంబం వంటి పథకాలు రాష్ట్ర ప్రజలకు మేలు కలిగించనున్నాయి.