టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్తరా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు తయారు చేసే అంశంపై , ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన చర్చ జరుగనుంది.

గత బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి గార్డెన్‌లో నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది.

Related Posts
పృథ్వీ కూడా క్షమాపణలు చెబితే బాగుండేది: వైసీపీ అభిమానులు
పృథ్వీ కూడా క్షమాపణలు చెబితే బాగుండేదని: వైసీపీ అభిమానులు

విష్వక్‌సేన్‌.. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న యువ కథానాయకుడు. 'ఫలక్‌ నామా దాస్‌', 'ఈ నగరానికి ఏమైంది', 'పాగల్‌' Read more

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు
అసెంబ్లీ సమావేశాల నుంచి జగన్ వాకౌట్

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన, వైఎస్​ జగన్​పై కేసు..! వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించారంటూ గుంటూరులోని నల్లపాడు పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.ఎన్నికల కోడ్​ Read more

అభిమానులపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం
pawan fire

తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో క్షతగాత్రులను పరామర్శించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అక్కడి అభిమానుల ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో Read more

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్, బాలకృష్ణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరియు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. మహిళల బలం, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *