టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం

టీటీడీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై సర్వత్తరా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, సమీక్ష అనంతరం శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టోకెన్ల కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శుక్రవారం టీటీడీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. తిరుమలలోని పాలక మండలి కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం కానుంది. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారంపై సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది.
బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం చెక్కులు తయారు చేసే అంశంపై , ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం చెక్కులను రేపు (శనివారం) అందజేసే అంశంపై చర్చించనున్నారు. అదేవిధంగా వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ తొక్కిసలాటపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అధ్యక్షతన చర్చ జరుగనుంది.

గత బుధవారం రాత్రి తిరుపతిలోని పద్మావతి గార్డెన్‌లో నెలకొల్పిన టోకెన్ల పంపిణీ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మృత్యువాత పడగా 48 మంది గాయపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఎస్పీ పాటు గోశాల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, టీటీడీ జేఈవో గౌతమి, సీవీఎస్‌వో శ్రీధర్‌ను అక్కడి నుంచి బదిలీ చేశారు. ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ ఇద్దరికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడ్డ వారికి లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారంగా ప్రకటించింది.

Related Posts
ఏపీలో మరో హైటెక్ సిటీకి చంద్రబాబు సన్నాహాలు?
chandra babu

ఒకప్పుడు హైదరాబాద్ నగరాన్ని ఐటీ కంపెనీలకు కేంద్ర బిందువుగా మారటానికి సీఎం చంద్రబాబు చేసిన కృషి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఏపీ-తెలంగాణ విడిపోయిన తర్వాత Read more

పింఛన్ల కోసం రూ.12,508 కోట్ల ఖర్చు – సీఎం చంద్రబాబు
cm chandrababu pension 1

అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం రూ.12,508 కోట్లు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. '1వ తేదీనే 98% మంది లబ్ధిదారులు Read more

శ్రీశైలంలోని దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
శ్రీశైలంలోని దుకాణాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

2015లో ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.426ని సమర్థిస్తూ హైకోర్టు 2019 సెప్టెంబర్ 27న ఇచ్చిన తీర్పుపై స్టే కొనసాగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.అయితే Read more

ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా బాధ్యతలు
Harish Kumar Gupta is the new DGP of AP

అమరావతి: ఏపీ నూతన డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. నేడు ఫ్యామిలీతో కలిసి తన ఛాంబర్ లోకి ప్రవేశించిన ఆయన, లాంఛనంగా బాధ్యతలు Read more