allu arjun

కోర్టులో కొనసాగుతున్న అల్లు అర్జున్ వాదనలు

నాంపల్లి కోర్టులో శుక్రవారం (నేడు) అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్‌ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్‌ లో విధానంలో హాజరు అయినారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది.

కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

Related Posts
రాష్ట్రంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌
MLC election polling started in the state

ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు హైదరాబాద్‌ : తెలంగాణలోని ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ(Graduate Mlc) స్థానాలకు గురువారం పోలింగ్ జరుగుతోంది. Read more

కేసీఆర్ చెబితేనే కేంద్ర మంత్రిని కలిశాం: కేటీఆర్
ktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో ఆయన పలువురు నేతలను కలిశారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... తమ Read more

తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం
secreteriat

తెలంగాణ సచివాలయంలో భద్రతా లోపం సచివాలయంలో ఫేక్ ఐడీతో దొరికిన వ్యక్తి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా చెప్పుకుంటూ బిల్డప్ నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో Read more

కేసీఆర్ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పాలాభిషేకం
ktr kcr

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more