allu arjun

కోర్టులో కొనసాగుతున్న అల్లు అర్జున్ వాదనలు

నాంపల్లి కోర్టులో శుక్రవారం (నేడు) అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వాదనలు కొనసాగుతున్నాయి. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్‌ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

Advertisements

సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్‌ లో విధానంలో హాజరు అయినారు. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది.

కాగా టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు.

Related Posts
Rape: హైదరాబాద్ లో ఘోరం.. ఐటీ ఉద్యోగినిపై ఆటోలో సామూహిక అత్యాచారం
it

హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది, ఈసారి ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై సామూహిక అత్యాచారం జరిగిన వార్త కలకలం రేపుతోంది. ఈ ఘటన గచ్చిబౌలి ప్రాంతంలో నిన్న Read more

HCA Vs SRH:హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం
హెచ్‌సీఏ, స‌న్‌రైజ‌ర్స్ వివాదం తెలంగాణ సర్కార్ విచారణకు ఆమోదం

ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సిఏ) మధ్య టికెట్ వివాదం తారస్థాయికి చేరుకుంది. ఎస్ఆర్ Read more

రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం
రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. Read more

Telangana Budget : నేడే తెలంగాణ బడ్జెట్.. ఎన్ని లక్షల కోట్లంటే ?
Today Telangana budget.. How many lakh crores is it?

Telangana Budget : ఈరోజు తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం నేడు అంటే బుధవారం రెండోసారి శాసనసభసలో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. దీనిపై భారీ Read more

Advertisements
×