karthika pournami

కార్తీక పౌర్ణమి ఎంత ప్రత్యేకమో తెలుసా..?

కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన 15వ రోజు. కార్తీక పౌర్ణమి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. కార్తీకమాసములో పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరి, హారులకు అత్యంత ప్రీతికరమైన మాసం. అన్ని మాసాల్లోను కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి.

‘శివునికి, విష్ణువునకు ఇద్దరికీ ఎంతో ఇష్టమైన మాసం కావున, కావున మానవాళికి వారిద్దరిని కొలిచి తరిస్తే వారి శుభ అనుగ్రహం పొందడానికి తగిన మాసమని దీనికి ఎంతో ‘ప్రాశస్త్యం’ కలిగినది అని పురాణాలుతెలుపుతున్నాయి. ఈ మాసంలో ప్రతి దినమూ పవిత్రమైనదే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావవంతమైనవి. నెలరోజులూ చేసే కృత్యాల ఫలితం ఒక ఎత్తు, పౌర్ణమి నాటి కృత్యాల ఫలితం మరొక ఎత్తు. అందువల్ల అనేక వ్రతాలు, పూజలు, కృత్యాలకు, దైవారాధనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలనీ పురాణాలు వివరిస్తున్నాయి.

ఈ పౌర్ణమి రోజున శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించిన వారికి సకల సంపదలు దరి చేరుతాయి. ఇందులో భాగంగా… మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించినట్లైతే… కోటి జన్మల పుణ్య ఫలం ప్రాప్తిస్తుందని విశ్వాసం. అంతే కాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. మహిళలు తమ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పము, తాంబూలాలతో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానంగా ఇవ్వడం చాలా మంచిది. ఇంకా దేవాలయాల్లో సహస్ర లింగార్చన, మహా లింగార్చనలు చేసిన వారికి సర్వశుభాలు ప్రాప్తిస్తాయని పురాణ వచనం.

Related Posts
కార్తీక పౌర్ణమి వేళ ఈ పనులు తప్పకుండా చేయాలి
karthika pournami

హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని “కార్తీక పౌర్ణమి” అంటారు. ఈ పవిత్రమైన రోజుకు హిందూ సంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. Read more

ప్రయాగ్ రాజ్‌లో బస చేసేందుకు బెస్ట్ ఆశ్రమాలు.. తక్కువ ధరకే లభ్యం..
kumbh mela

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే మహా కుంభమేళా, ఈసారి ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నగరంలో జనవరి 13 నుండి ఫిబ్రవరి 26, 2025 వరకు నిర్వహించబడుతుంది. Read more

కుంభ్ స్వచ్ఛ వారియర్స్ కు రూ.10000 బోనస్ – సీఎం యోగి ప్రకటన
maha Kumbh Swachh Warriors

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహా కుంభమేళాలో శ్రమించిన స్వచ్ఛ వారియర్స్ సేవలను ఘనంగా ప్రశంసించారు. 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్‌ను పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర Read more

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి: ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీశైలంలో భక్తుల రద్దీతో సందడి ప్రత్యేక ఏర్పాట్లు సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో నంద్యాల జిల్లాలోని శ్రీశైల ముక్కంటి మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ అనూహ్యంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *