si and constable death

ఎస్ఐ, కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

తెలంగాణలో సంచలనం సృష్టించిన ట్రిపుల్ డెత్ కేసులో చిక్కుముడులు వీడనున్నాయి. భిక్కనూర్ ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుల కుటుంబ సభ్యులను, వారితో పనిచేసిన సిబ్బందిని ప్రశ్నించి వివరాలు రాబడుతున్నారు. ముగ్గురి ఫోన్లను తెరిచేందుకు విఫలయత్నం చేశారు. అయితే మృతుల బ్యాంక్ ఖాతాలు, లాకర్లను తెరిస్తే ఏదైనా క్లూ దొరకవచ్చని భావిస్తున్నారు. ఇందుకోసం ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వివాహేతర సంబంధమే కారణమా?

బీబీపేట ఎస్ఐగా వచ్చిన సాయి కుమార్ మంచి వ్యక్తి అని, అందరితో కలుపుగోలుగా ఉంటారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. విధినిర్వహణలో కానిస్టేబుల్ శృతితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందని అన్నారు. ఎస్ఐ సాయి కుమార్ తో బంధం కన్నా ముందే శృతి కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ తో ప్రేమ వ్యవహారం నడిపిందని సమాచారం.

నిలదీసిన ఎస్ఐ సాయి కుమార్ తో వివాదం?

ఈ విషయం ఎస్ఐకి తెలిస్తే తనకు ప్రమాదమని భావించిన శృతి.. నిఖిల్ ను ఎస్ఐ సాయి కుమార్ కు దగ్గర చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయి కుమార్ కు భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో గ్యాప్ పెరిగిందన్నారు. ఆ తర్వాత శృతి, నిఖిల్ ల ప్రేమ వ్యవహారం తెలియడంతో సాయి కుమార్ ఇద్దరినీ నిలదీశారని, ఈ విషయంపై మాట్లాడుకోవడానికే ముగ్గురూ అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువు దగ్గర కలిశారని అధికారులు భావిస్తున్నారు.

మాటామాటా పెరగడంతో బెదిరించేందుకు శృతి ముందుగా చెరువులో దూకి ఉండవచ్చని, ఆ తర్వాత నిఖిల్ కూడా దూకడంతో ఆందోళనకు గురైన ఎస్ఐ సాయి కుమార్ కూడా ఆత్మహత్య చేసుకుని ఉంటాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రానున్నాయి అని పోలీసులు చెబుతున్నారు.

Related Posts
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల ప్రారంభం వాయిదా
Telangana Assembly special session start postponed

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. 11 గంటలకు సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. మంత్రివర్గ భేటీ Read more

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులను రిలీవ్‌ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Telangana government relieved two IPS officers

డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను రిలీవ్ చేసిన ప్రభుత్వం హైదరాబాద్‌: సీనియర్ ఐపీఎస్ అధికారులు డీజీ అంజనీకుమార్, అభిలాష బిస్త్‎ను తెలంగాణ సర్కార్ రిలీవ్ చేసింది. ఈ Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్ మాస్టర్ ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరమైన చర్చకు దారితీస్తున్నాయి, ఎందుకంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన Read more

తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు : సీఎం రేవంత్ రెడ్డి
Revanth reddy

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్స్ వరకు అనుమతి ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *