భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద అదుపుతప్పి చెరువులోకి కారు దూసుకువెళ్ళింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకులు చెరువులో మునిగి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వంశి (23), దిగ్నేశ్ (21), హర్ష (21),బాలు (19), వినయ్ (21) లుగా గుర్తింపు. మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు.
