keerthi suresh

నేను సింగిల్ అని చెప్పానా అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది

ఇటీవల హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి గురించి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమె ఓ కమెడియన్‌ను వివాహం చేసుకుందని, లేదా ఒక ప్రముఖ నిర్మాతతో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అంతేకాకుండా, తన చిన్ననాటి స్నేహితుడితో రిలేషన్‌లో ఉందని కూడా కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ అన్ని వార్తలు పుకార్లే అని కీర్తి సురేష్ క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం కీర్తి తన కెరీర్‌పై దృష్టి సారించింది, ఆమె చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి. తమిళంలో రాబోతున్న రఘు తాత అనే సినిమాలో నటిస్తూ, ఆగస్టు 15న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, మీడియా ప్రతినిధులు అడిగిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలకు కీర్తి సరదాగా సమాధానాలు ఇచ్చింది. ఒక విలేకరి మీరు ఇంకా సింగిల్‌గా ఉండటంతో బోర్ అనిపించడం లేదా అని ప్రశ్నించగా, కీర్తి నవ్వుతూ “నేను సింగిల్ అని ఎక్కడా చెప్పలేదు కదా అంటూ చమత్కరించింది. ఈ వ్యాఖ్యతో, ఆమె నిజంగా రిలేషన్‌లో ఉందా లేదా అన్నదానిపై ఆసక్తికర చర్చ మొదలైంది.

తన పెళ్లి గురించి మాట్లాడుతూ, కీర్తి తన ప్రాధాన్యత సినిమాలపైనే ఉందని, తగిన సమయాన తన పెళ్లి వార్తను అందరితో పంచుకుంటానని స్పష్టం చేసింది. పెళ్లి, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లను ఆమె సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంది ఇంకా, కీర్తి సురేష్ బాలీవుడ్‌లో కూడా తన ప్రవేశం కోసం సన్నాహాలు చేస్తోంది. బాలీవుడ్‌లో బేబీ జాన్ అనే సినిమాలో హీరో వరుణ్ ధావన్‌తో కలిసి నటిస్తోంది. ఈ సినిమాలో కీర్తి రొమాంటిక్ సీన్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వారిద్దరి మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు కూడా ఉంటాయని వార్తలు వినిపిస్తున్నాయి.

Related Posts
కడుపు పగిలేలా నవ్వాలి ఇ సారి – మ్యాడ్ స్క్వేర్ టీజర్
‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ విశ్లేషణ

పరిచయం: ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ తో వినోదం షురూ! తెలుగులో హాస్యభరిత చిత్రాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. తాజాగా విడుదలైన ‘మ్యాడ్ స్క్వేర్’ టీజర్ ఆడియెన్స్‌కి Read more

అవును నేను ప్రేమలో పడ్డాను: నిహారిక
అవును నేను ప్రేమలో పడ్డాను: నిహారిక

నాగబాబు గారాల కూతురు నిహారిక ప్రస్తుతం సినిమాలు తీస్తూ నిర్మాతగా స్థిరపడాలనుకుంటోంది. ఇటీవలే చిరంజీవి విశ్వంభర చిత్రంలోని ఓ పాటలో షూటింగ్ లో పాల్గొంది. ఈ పాటలో Read more

ఆమిర్‌ ఖాన్‌తో తరహా మూవీ దిల్‌రాజు వంశీ ప్రయత్నాలు
Aamir khan dil raju

సౌత్‌ ఇండియన్‌ దర్శకులు ఈ మధ్య బాలీవుడ్‌లో వరుసగా భారీ విజయాలను సాధిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. షారుక్‌ ఖాన్‌తో అట్లీ దర్శకత్వంలో వచ్చిన 'జవాన్' సినిమా ₹1000 Read more

Cinema: విజయానికి నోచుకోని ఈ సినిమాలు
Cinema: విజయానికి నోచుకోని ఈ సినిమాలు

తెలుగు సినిమాల భారీ డిజాస్టర్‌లు – 2023, 2024 లో చిత్తుగా పడిన సినిమాలు తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి సినిమా ప్రారంభించే ముందు ప్రేక్షకులకు, దర్శకులకు, Read more