రేవంత్ తో భేటీకి చిరంజీవి దూరం

రేవంత్ తో టాలీవుడ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది. సంధ్యా థియేటర్ ఘటనతో పాటుగా సినీ పరిశ్రమ సమస్యల పైన ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే సినీ ప్రముఖులు సమావేశం జరిగే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్నారు. అయితే, అనూహ్యంగా ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉన్నారు. దీంతో, కొత్త చర్చ తెర మీదకు వచ్చింది.

చిరంజీవి గైర్హాజరు సీఎం రేవంత్ తో సమావేశానికి సర్వం సిద్దమైంది. సినీ ప్రముఖులు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు చేరుకున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన చిరంజీవి మాత్రం రాలేదు. మెగా హీరోల్లో వరుణ్ తేజ్ హాజరయ్యారు. అల్లు అరవింద్ .. దిల్ రాజు ఈ టీం ను లీడ్ చేస్తున్నారు. అయితే, చిరంజీవి గైర్హాజరు వెనుక పలు కారణాల పైన చర్చ జరుగుతోంది.
రేవంత్ తో మెగా చర్చలు కాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ మాత్రం తొలి నుంచి ఈ వివాదానికి దూరంగా ఉన్నారు. అయితే, ఈ సంక్రాంతికి రాం చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సైతం విడుదల కానుంది. తెలంగాణ ప్రభుత్వం బెనిఫట్ షోలు.. టికెట్ ధరల పెంపు పైన నిర్ణయం వెనక్కు తీసుకోకుంటే నష్టం తప్పదనే అంచనాలు ఉన్నాయి. దీంతో, రేవంత్ ను ఒప్పించి.. ఆ నిర్ణయంలో సడలింపు కోసం దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భేటీ ఏర్పాటు చేసారు. అయితే, ఈ భేటీ ఏర్పాటుకు తొలి నుంచి పూర్తి ప్రయత్నాలు చేసిన చిరంజీవి ప్రస్తుతం విదేశాలలో ఉన్నారని తెలుస్తుంది. అయితే, రేవంత్ తో ఫోన్ లో మాట్లాడిన సమయంలోనే కీలక అంశాలను ప్రస్తావన చేసినట్లు సమాచారం.

Related Posts
అప్పుడే వణికితే ఎలా మంత్రులు..? – కేటీఆర్ ట్వీట్
Will march across the state. KTR key announcement

బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్..సోమవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన లో ఆయన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌ Read more

మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి హౌస్‌ అరెస్టు
Former MLA Padmadevender Re

మెదక్ మాజీ ఎమ్మెల్యే , బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు యం. పద్మదేవేందర్ రెడ్డి ని శుక్రవారం ఉదయం పేట్ బషీరాబాద్ కొంపల్లి పోలీసులు Read more

జానీ మాస్టర్‌కు రంగా రెడ్డి జిల్లా కోర్టులో స్వల్ప ఊరట
Johnny Master in police custody

Ranga Reddy District Court got a little relief for Johnny Master హైదరాబాద్‌: తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ యువతిపై Read more

డేటా ఇంజినీరింగ్లో 3 నెలలు ఉచిత శిక్షణ – మంత్రి శ్రీధర్ బాబు
We will create more jobs in IT.. Minister Sridhar Babu

తెలంగాణ రాష్ట్ర యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం డేటా ఇంజినీరింగ్‌లో 90 రోజుల ఉచిత శిక్షణను అందించనుంది. టాస్క్ (Telangana Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *