manipur cm

మణిపూర్ సీఎం నివాసం వద్ద బాంబు కలకలం

ఏడాదిగా మణిపూర్ లో జాతుల మధ్య జరుగుతున్న ఘర్షణతో వందలాది మంది చనిపోయారు. అనేకులు తమ నివాసాలను కోల్పోయారు. రాష్ట్రం ఏడాదిగా అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసం వద్ద బాంబు కలకలం రేపింది. బీరేన్ సింగ్ నివాసానికి కొన్ని మీటర్ల దూరంలో ఈ తెల్లవారుజామున ఓ మోర్టార్ బాంబును స్థానికులు గుర్తించారు. తీవ్ర భయాందోళనలకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాంబును నిర్వీర్యం చేశారు. బాంబును గుర్తించిన సమయంలో బీరేన్ సింగ్ నివాసంలో లేరని తెలుస్తోంది.
మణిపూర్ లో గత కొంత కాలంగా సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేయాలనీ ఆ పార్టీ వారే డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ రాకెట్ ప్రొపెల్డ్ బాంబును గత రాత్రి ప్రయోగించి ఉండొచ్చని… అది పేలకుండా ఇక్కడ పడిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబును ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎవరు ప్రయోగించి ఉంటారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీఎం నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Advertisements
Related Posts
AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC
AI, డ్రోన్, క్లౌడ్ కంప్యూటింగ్‌లో శిక్షణ: NSDC

నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NSDC) ఏర్పాటుచేసిన స్కిల్ ఇండియా డిజిటల్ హబ్ (SIDH) AI, డ్రోన్ టెక్నాలజీ, డేటా సైన్స్ మరియు క్లౌడ్ కంప్యూటింగ్‌లోని కోర్సుల Read more

అంబానీ-మిట్టల్‌లకు భారీ జరిమానా
అంబానీ-మిట్టల్‌లకు భారీ జరిమానా

జియో, ఎయిర్‌టెల్, BSNL, వోడాఫోన్ ఐడియా పై 1410 కోట్ల జరిమానా ముఖేష్ అంబానీ, సునీల్ మిట్టల్‌లకు భారీ దెబ్బ. జియో, ఎయిర్‌టెల్, BSNL మరియు వోడాఫోన్ Read more

నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం
నేడు నేతాజీ గౌరవార్థం పరాక్రమ దినోత్సవం1

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి సందర్భంగా, ఆయన వారసత్వాన్ని గౌరవించేందుకు కటక్‌లోని నేతాజీ జన్మస్థలంలో మూడు రోజుల ప్రత్యేక కార్యక్రమం జనవరి 23న ప్రారంభమవుతుంది. ఈ Read more

వంట నూనెల ధరలకు చెక్: నిర్మలా సీతారామన్
cooking oil

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలో ఆమె మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశ ఆర్థిక Read more

×