ys sharmila

భక్తులు దర్శనం కోసం వస్తే వైకుంఠానికే పంపుతున్నారు : వైఎస్‌ షర్మిల

వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుపతికి వస్తే ఏకంగా వైకుంఠానికే పంపుతున్నారని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. మొన్న లడ్డు కల్తీ.. నేడు తొక్కిసలాట. కోట్లాది హిందువుల ఆరాధ్య దేవుడు, కలియుగ దైవం వెంకన్న క్షేత్రానికి మచ్చ తెచ్చి పెట్టాయని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. తిరుపతిలో నిన్న జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం బాధాకరమని ట్విటర్‌లో పేర్కొన్నారు.
గోవింద నామాలు ప్రతిధ్వనించాల్సిన చోట ఘోరమైన మృత్యుఘోష ఆర్తనాదాలు వినిపించాయని అన్నారు. లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసి కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడం పాలన యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనమని వెల్లడించారు.

తొక్కిసలాట ఘటనపై వెంటనే అత్యున్నత విచారణ జరిపించి బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. ఆరుగురు భక్తులు చనిపోయిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని, చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం చెల్లించి చేతులు దులుపుకోవడం అన్యాయమని అన్నారు. ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించాలని, వారి ఇంట్లో అర్హులు ఉంటే ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Related Posts
టీచర్ MLC ఎన్నిక- వైసీపీపై అచ్చెన్నాయుడు ఫైర్
acham mlc

ఉత్తరాంధ్రంలో జరిగిన టీచర్ MLC ఎన్నికల్లో TDP ఓటమి నమోదైనట్లు రాజకీయ వేదికపై తాజా పరిణామాలు వచ్చాయి. ఈ సందర్భంలో, టీచర్ సంఘాల నుంచి వచ్చిన అసంతృప్తి Read more

ఆంధ్రప్రదేశ్‌లో రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభం
Revenue Meetings From Today in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ స్థాయిలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సదస్సులు ప్రారంభమవుతాయి. వచ్చే నెల Read more

ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు

ఏపీలో కేబినెట్ మీటింగ్ ఇంకా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. ఈ ఏపీ కేబినెట్ Read more

ఈవీలకు పన్ను రాయితీ – ఏపీ ప్రభుత్వం
Tax concession for EVs AP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీలు) కొనుగోలుదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకునేవారికి పూర్తిగా పన్ను రాయితీ ఇవ్వనున్నట్లు అధికారికంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *