bengaluru

బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను ఈ ఏడాది జనవరిలో గొల్లహళ్లిలో ఒకే విడతలో ప్రీకాస్ట్ చేయడం విశేషం. బైయప్పనళ్లి-చిక్కబనవర లైన్‌లో యశ్వంతపూర్‌లో గత రాత్రి 9.45-10 గంటల మధ్య ఆవిష్కరించినట్టు ‘కే-రైడ్’ (కర్ణాటక రైల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కంపెనీ లిమిటెడ్) అధికారులు తెలిపారు.
యూ’ ఆకారంలో గర్డర్‌
‘యూ’ ఆకారంలో ఉన్న ఈ గర్డర్‌లను రైల్వే ఆధారిత ప్రజారవాణా ప్రాజెక్టులలో ఉపయోగిస్తుంటారు. హెబ్బాల్-యశ్వంతపూర్ మధ్య మల్లిగే లైన్ 8 కిలోమీటర్ల ఎలివేటెడ్ సెక్షన్‌లో 450 యూ-గర్డర్‌లు ఉపయోగిస్తున్నారు. గొల్లహళ్లి వద్ద ఇప్పటికే 60 యూ గర్డర్లు వేశారు. కాగా, మల్లిగే లైన్‌ను డిసెంబర్ 2026 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇవి నాణ్యంగా ఉండటంతోపాటు నిర్మాణ సమయాన్ని ఆదా చేస్తాయి. మెట్రో ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు గరిష్ఠంగా 28 మీటర్ల యూ గర్డర్లను మాత్రమే ఉపయోగించారు. యూ గర్డర్‌కు 69.5 క్యూబిక్ మీటర్ల ఎం60 గ్రేడ్ కాంక్రీట్ అవసరం అవుతుంది. బరువు ఏకంగా 178 టన్నులు ఉంటుంది.

Advertisements

Related Posts
Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?
Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?

బ్రిడ్జి ప్రారంభోత్సవంలో వివాదం అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఇటీవల ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఊహించని సంఘటన Read more

అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
indian money

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక సంబంధమైన పనులకు చేసిన కొన్ని మార్పులు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ వివరాలు ఏమిటో తెలుసుకుందాం. జీఎస్టీలో కీలక మార్పులుజీఎస్టీ Read more

ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు
ఎన్నికల ఓటమి తర్వాత ఆప్‌లో తాజా పరిణామాలు

ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ పార్టీ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ భవితవ్యంపై అనేక Read more

యథాతథంగానే రెపో రేటు..
rbi announces monetary policy decisions

న్యూఢిల్లీ: కీలకమైన రెపో రేటును వరుసగా 10వ సారి 6.5 శాతంగా కొనసాగించాలని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ నిర్ణయించింది. ఈ మేరకు బుధవారంతో ముగిసిన మూడు రోజుల Read more

×