Yadagirigutta Devasthanam Board on the lines of TTD

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు

హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు సిద్ధమైన ముసాయిదాలో పలు మార్పులను సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై సీఎం తన నివాసంలో బుధవారం సమీక్ష నిర్వహించారు.

తిరుమల ఆలయంతో సమానంగా, యాదగిరిగుట్ట ఆలయం పరిసరాల్లో రాజకీయప్రభావం లేకుండా చూడాలని, ఆలయపవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధర్మకర్తలమండలి నియామకం అలాగే ఆలయం తరఫున నిర్వహించాల్సిన ఆధ్యాత్మిక,సేవా కార్యక్రమాలకు సంబంధించి ముసాయిదా నిబంధనల్లో ముఖ్యమంత్రి పలు మార్పులను సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

image

కాగా, తిరుమల తరహాలో యాదగిరిగుట్టకు ప్రత్యేక బోర్డు ఏర్పాటైతే ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆలయ అభివృద్ధిలో ప్రభుత్వ జోక్యం ఉండదు. ఆలయానికి వచ్చే నిధులు, కానుకల ద్వారా అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. యాదగిరిగుట్ట ఆలయంతో పాటుగా.. అనుబంధ ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వంపై ఆధారపడకుండా.. బోర్డు ద్వారానే డెవలప్‌మెంట్ పనులు చేయనున్నారు. భక్తులకు కూడా మెరుగైన సౌకర్యాలు, నిత్య అన్నదానం వంటివి అందుబాటులోకి వస్తాయి.

Related Posts
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు 234 మరణాలు
డిసెంబరులో 6 విమాన ప్రమాదాలు, 234 మరణాలు

డిసెంబర్ నెలలో వరుసగా జరిగిన ఘోరమైన విమాన ప్రమాదాలు విమానయాన భద్రతపై గంభీర ప్రశ్నలను లేవనెత్తాయి. మొత్తం 6 ప్రధాన సంఘటనల్లో 234 మంది మరణించడం తీవ్ర Read more

గాయపడిన రష్మిక మందన!
గాయపడిన రష్మిక మందన!

'యానిమల్', 'పుష్ప 2: ది రూల్' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో వరుస విజయాలను సాధించిన రష్మిక మందన ప్రస్తుతం తన రాబోయే చిత్రం సికందర్లో పని Read more

ముజిగల్ ఎడ్యుటెక్ మైలురాయి వేడుకలు
Muzigal Edutech milestone celebration

హైదరాబాద్ : సంగీత విద్య కోసం భారతదేశం యొక్క ప్రీమియర్ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా వెలుగొందుతున్న, ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశం అంతటా 100+ అకాడమీ Read more

తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు
Two key agreements in Telangana on the same day

ఇప్పటి వరకు 53 భారీ హోర్డింగులను తొలగించిన హైడ్రా హైదరాబాద్‌: తెలంగాణకు గూగుల్ గుడ్‌ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ కేంద్రంగా ఏఐ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *