ఏడుపాయల వనదుర్గామాత ను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సదర్భంగా అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు .ఆలయ ఈవో చంద్రశేఖర్,, ఆలయ అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనుపమ చక్రవర్తి వనదుర్గ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యక పూజలు నిర్వహించి
తీర్థప్రసాదాలు స్వీకరించారు.

