UI talk

ఉపేంద్ర ‘UI’ మూవీ ఎలా ఉందంటే..!!

బ్యాన‌ర్‌: ల‌హ‌రి ఫిలింస్‌, వీన‌స్ ఎంట‌ర్టైన‌ర్స్‌
టైటిల్‌: UI
న‌టీన‌టులు: ఉపేంద్ర‌, రీష్మా నానయ్య, ఇంద్రజిత్ లంకేష్ తదితరులు
సినిమాటోగ్ర‌ఫీ: హెచ్‌సీ. వేణు
ఫైట్స్‌: థ్రిల్ల‌ర్ మంజు, ర‌వివ‌ర్మ‌, చేత‌న్ డిసౌజా
ఎడిటింగ్‌: విజ‌య్ రాజ్‌
మ్యూజిక్‌: అజ‌నీష్ లోక‌నాథ్‌
నిర్మాత‌లు: జీ మ‌న్మోహ‌న్‌, శ్రీకాంత్ కేపీ
ర‌చ‌న – ద‌ర్శ‌క‌త్వం: ఉపేంద్ర‌
సెన్సార్ రిపోర్ట్ : U / A
ర‌న్ టైం: 130 నిమిషాలు
రిలీజ్ డేట్ : 20 డిసెంబ‌ర్‌, 2024

Advertisements

కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన ‘UI’ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో తన సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. 10 సంవత్సరాల తర్వాత హీరోగా, దర్శకుడిగా ‘UI’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుకున్నాడు.

‘UI’ సినిమా కథ 2040 సంవత్సరంలో ప్రపంచం ఎలా ఉంటుందో అనే అంశంపై ఆధారపడింది. ఈ సినిమాలో “పగలు, రాత్రి” అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాలో కల్కి అవతారంగా ఉపేంద్ర నటన సినిమాకే హైలెట్ గా ఉంది. సినిమాను ఉత్కంఠభరితంగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. ఆయన మార్క్ డైలాగ్స్, సినిమాకు శక్తివంతమైన పలు అంశాలను జోడించాయి. ఈ సినిమాను ఎంతో వినూత్నంగా, సరికొత్త నేరేషన్‌తో తెరకెక్కించారు.

‘కాంతారా’ చిత్రానికి సంగీతం అందించిన అజనీష్ లోకానాథ్, ‘UI’ చిత్రానికి కూడా అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సంగీతం సినిమాకు మరింత మేజిక్ ఇచ్చింది. సినిమాను ఆసాంతం ఒక ఫిక్షనల్ వరల్డ్ లోకి తీసుకువెళ్లి కాస్త బుర్రక పదును పెట్టి, చివరికి ఊహించని విధంగా ప్రేక్షకులలో మెదడులలోనే అనేక ప్రశ్నలు రేకెత్తించే విధంగా ముగించడం ఉపేంద్ర మార్క్ అని చెప్పాలి. ఓవరాల్ గా ప్రేక్షకులు , అభిమానులు పెట్టుకున్న అంచనాలను UI అందుకుంది. సినీ విశ్లేషకులు సైతం సూపర్ హిట్ అంటూ మంచి రేటింగ్ ఇస్తున్నారు.

Related Posts
ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు
ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో Read more

దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్..
illegal mining

దక్షిణాఫ్రికాలో స్టిల్‌ఫాంటేన్ ప్రాంతంలోని ఒక మూసివేసిన మైనింగ్ షాఫ్ట్ నుండి గత 24 గంటలలో ఆరుగురు అక్రమ మైనర్ల శవాలను కనుగొన్నారు. ఇంకా సుమారు 100 మంది Read more

OCల సంఖ్యను కేసీఆర్ ఎక్కువగా చూపారు – సీఎం రేవంత్
CM Revanth condemns attacks on houses of film personalities (1)

తెలంగాణలో ఓసీల సంఖ్యపై మాజీ సీఎం కేసీఆర్ తప్పుడు గణాంకాలు చూపించారని ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. గత పాలనలో కేసీఆర్ ఓసీల సంఖ్య 21 Read more

ఇప్పటివరకు ఛావా కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే?
ఇప్పటివరకు ఛావా కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే?

విక్కీ కౌశల్ ఛావా చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. నార్త్‌లో ఆల్రెడీ 500 కోట్లకు పైగా నెట్, ఆరు వందల కోట్లకు పైగా గ్రాస్ Read more

Advertisements
×