న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు. 2019లో ఆమె బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తాత్కాలిక బడ్జెట్లతో కలిపి వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ.. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌ను (వరుసగా 6 సార్లు) అధిగమించారు. ఇవాళ ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. దీంతో ఆమె మరో మైలురాయిని అందుకున్నారు. అత్యధిక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వారిలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని సమం చేశారు. ఇప్పటివరకు అత్యధికంగా 10 సార్లు మొరార్జీ దేశాయ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, పీ. చిదంబరం 9 సార్లు బడ్జెట్ సమర్పించారు.
లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు..
మహిళల పట్ల దృష్టి సారించాం..
గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడం కోసం అందరిని కలుపుకుపోతున్నాం..
ఇంధన సరఫరాను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం..
వ్యవసాయం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించాం
వికసిత భారత్‌లో సమ్మిళిత వృద్ధి ప్రధానం..
రైతుల ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నాం..
వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలుచేస్తాం.
గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టించడానికి చర్యలు..
వ్యవసాయ ఉత్పాదకను పెంపొందిస్తున్నాం..
ప్రస్తుతం పథకాలతో అధునాతన వ్యవసాయ పద్ధతులను తీసుకొస్తున్నాం..
పంటల్ని స్టోరేజ్ చేసేందుకు సదుపాయాలు కల్పిస్తాం.
దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవస్థ వల్ల రైతులకు లబ్ది
గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తాం
నైపుణ్యాన్ని, టెక్నాలజీని పెంపొందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నాం
చిన్న, సన్నకారు రైతులను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నాం
సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తాం.
ఫేజ్ -1 కింద 100 గ్రామాలను తీసుకుంటాం..
పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగింది..
రాబోయే నాలుగేండ్లలో పప్పు ధాన్యాలను ప్రత్యక్షంగా సేకరిస్తాం..
కూరగాయాలు, పండ్ల కోసం కొత్త కార్యక్రమాలు తీసుకువస్తాం
సమాజంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారు..
కూరగాయాలు, పండ్ల వీటి వినియోగం పెరుగతుంది..
రైతులకు మరిన్ని లాభదాయక ధరలు పెంచేలా చేస్తాం..
భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మత్స్య సంపద కలిగిన దేశం
సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహిస్తాం..
సుస్థిరమైన మత్స్య పద్ధతులను తీసుకువస్తాం
దీవులపై కూడా దృష్టి సారిస్తాం
పత్తి రైతుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నాం
పత్తిలో ఎక్కువ రకాలు తీసుకువస్తాం..
సాంకేతికత తీసుకువస్తున్నాం.. ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నాం
సంప్రదాయక వస్త్ర ఉత్పత్తిని పెంపొందిస్తాం..
ఎంఎస్ఎంఈలపై దృష్టి సారిస్తున్నాం..
ఒక కోటి కంటే ఎక్కువ ఎంఎస్ఎంఈలు నమోదు అయి ఉన్నాయి..
ఉద్యోగ కల్పన బాగా ఉంది
నాణ్యమైన ఉత్పత్తులతో పాటు 45 శాతం ఎగుమతులు ఉన్నాయి..
సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిస్తున్నాం..
మూలధనం పెంచబోతున్నాం
2.5 రెట్లు అధికంగా కేటాయింపులు చేస్తున్నాం
ఎంఎస్ఎంఈల వృద్ధికి ప్రయత్నిస్తున్నాం..
సూక్ష్మ పరిశ్రమలు 1.5 లక్షల కోట్ల వరకు రాబోయే ఐదేండ్లలో రుణాలు ఇస్తాం..