us and denmark

డెన్మార్క్ ప్రధానికి ట్రంప్ తీవ్ర బెదిరింపులు!

అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్.. గతంలోలాగే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తాను చేయాలనుకున్న పనులను అమలు చేస్తూనే.. కోరుకున్నవన్నీ దక్కించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి సారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడే గ్రీన్‌లాండ్ కొనుగోలు చేయాలనుకున్న ట్రంప్.. ఈసారి పదవిలోకి రాకముందు నుంచే కచ్చితంగా ఈసారి గ్రీన్‌లాండ్‌ను దక్కించుకుంటానని చెప్పారు. ఆ కలను నెరవేర్చుకోవడానికి తాజాగా డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఫోన్ చేశారు. ముఖ్యంగా వారి అధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమ్మాలంటూ ప్రతిపాదించారు.

Advertisements

కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం అది కుదరదని చెప్పారట. పెద్ద ఎత్తున ఖనిజాలు లభించే గ్రీన్‌లాండ్‌ను అమ్మాలనే ఉద్దేశమే తమకు లేదని వివరించగా.. ట్రంప్ చాలా సీరియస్ అయినట్లు సమాచారం. ఈక్రమంలోనే మెటె ఫ్రెడెరిక్సన్‌తో చాలా దూకుడుగా మాట్లాడరట. తన కలను నెరువేర్చుకునేందుకు బెదిరింపులకు కూడా పాల్పడ్డారట. ఆ మాటలు విన్న ట్రంప్ వద్దనున్న అధికారులు వాటికి ఆశ్చర్యపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
మొత్తం 45 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ కాల్‌లో.. ట్రంప్ డెన్మార్క్ మీద విధించబోయే సుంకాల గురించి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. కానీ డెన్మార్క్ ప్రధాని మాత్రం వాటేమిటికీ భయపడకుండా గ్రీన్‌లాండ్‌ను అస్సలే అమ్మబోమని వివరించినట్లు సమాచారం.

Related Posts
బిలియనీర్లలో భారత్‌కు మూడో స్థానం
India ranks third among billionaires

న్యూఢిల్లీ: దేశంలో మిలియనీర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నది. గత ఏడాదితో పోలిస్తే దేశంలో మిలియనీర్ల సంఖ్య 6 శాతం మేర పెరిగినట్టు గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ సంస్థ Read more

అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?
అమెరికాలో ఎవరెవరిని బహిష్కరిస్తున్నారు?

అమెరికాలో 'చట్టవిరుద్ధంగా' నివసిస్తున్న 104 మంది భారతీయులను ఆ దేశం ఇటీవలే వెనక్కు పంపించింది. ఇందులో గుజరాత్, హరియాణా, పంజాబ్‌లకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. డోనల్డ్ Read more

మరణశిక్షను రద్దు చేసిన జింబాబ్వే
Zimbabwe has abolished the death penalty

జింబాబ్వే : జింబాబ్వే మరణశిక్షను రద్దు చేసింది. దాదాపు రెండు దశాబ్దాల క్రితం చివరిసారిగా ఈ శిక్షను అమలు చేసిన దేశంలో ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. Read more

ట్రంప్ విజయంపై మోదీ అభినందన…
modi

2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని సాధించటంపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అతని మిత్రుడు ట్రంప్‌ను అభినందించారు. ఈ విజయాన్ని “చారిత్రకమైనది” Read more

×