హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 20 సంవత్సరాలుగా దక్షిణ భారత సినీ ఇండస్ట్రీలో ఆమె తన సత్తా చాటుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోను ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి అభిమానులను సంపాదించుకుంది. 2000ల తొలినాళ్లలోనే టాప్ హీరోయిన్‌గా నిలిచిన త్రిష, మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది.

యంగ్ హీరోయిన్ల రాకతో త్రిష కెరీర్‌లో ఒక దశలో గ్యాప్ వచ్చింది. కానీ 2022-23లో ఆమె మళ్లీ గట్టిపెట్టుకుని టాప్ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీ అయిపోయింది. పొన్నియిన్ సెల్వన్ 1 & 2 చిత్రాల్లో ఆమె కీలక పాత్ర పోషించగా, 2023లో విడుదలైన లియో చిత్రం మళ్లీ త్రిషను లైమ్‌లైట్‌లోకి తెచ్చింది. ఈ సినిమా విజయంతో ఆమెకు భారీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.
త్రిష ప్రేమ, – పెళ్లి వార్తలపై చర్చ
త్రిష జీవితంలో ప్రేమ గురించి ఎప్పుడూ ఓపెన్‌గా మాట్లాడలేదు, కానీ ఆమెకు సంబంధించిన ప్రేమ, పెళ్లి రూమర్స్ తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఒకానొక సమయంలో త్రిష, రానా దగ్గరైపోయారని, వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపించాయి. వీరు చాలాసార్లు పబ్‌లలో, పార్టీలలో కలిసిఉండడం ఈ ప్రచారానికి బలాన్ని ఇచ్చింది. అయితే అనూహ్యంగా రానా మిహీకా బజాజ్‌ను పెళ్లి చేసుకోవడంతో ఈ రూమర్స్‌కు ముగింపు పడింది. ఇటీవల విజయ్, త్రిష మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని కొందరు వార్తలు రాశారు. వారిసు సినిమా ప్రమోషన్ల సమయంలో కూడా వీరి మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించడంతో ఈ రూమర్లు మరింత బలపడాయి. అంతేకాదు, విజయ్ తన భార్య సంజయికి విడాకులు ఇచ్చి, త్రిషను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ రూమర్లపై ఇద్దరూ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. తాజాగా త్రిష తన సోషల్ మీడియాలో “Love Always Wins” అనే క్యాప్షన్‌తో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో ఆమె సంప్రదాయంగా పచ్చని పట్టుచీర, తలలో మల్లెపూలు, ముక్కుపుడక ధరించి కనిపించింది. ఇది చూస్తూనే ఆమె పెళ్లి చేసుకున్నట్లు ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు త్రిష పెళ్లిపై రకరకాల వార్తలు వచ్చినా, త్రిష మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. గతంలో ఆమె ఓ బిజినెస్ మ్యాన్‌తో నిశ్చితార్థం జరిగినప్పటికీ పెళ్లి ముందుకు సాగలేదు. త్రిష పెళ్లి వార్తలకు సంబంధించి ఆమె నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ ఆమె తాజా పోస్ట్ మాత్రం అభిమానుల్లో పెళ్లి ఊహాగానాలను పెంచేసింది.