హీరోలా ఉన్నోడిని.. భయంకర విలన్‏గా మార్చేశారు కదరా..

salim baig

టాలీవుడ్ సినిమా ప్రేమికులకు సలీమ్ బేగ్ అన్న పేరు తెలియకపోవచ్చు కానీ 2004లో వచ్చిన వెంకటేశ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఘర్షణ సినిమాలోని భయంకరమైన పాండా పాత్ర మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా చేసిపెట్టింది. ఈ సినిమాతో సలీమ్ బేగ్ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనదైన ముద్ర వేశాడు అయితే తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న టీనేజ్ ఫోటో చూసినవారు ఇప్పుడు సలీమ్‌ని పూర్తిగా కొత్తదనం గా చూస్తున్నారు ఈ ఫోటోలో సలీమ్ అప్పటి హీరోలా కనిపిస్తున్నాడు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన పాత చిత్రాలతో ఇప్పటికీ సోషల్ మీడియాలో తెగ చర్చనీయాంశంగా మారాడు నెటిజన్లు ఆయన పాత లుక్ ను చూస్తూ హీరోలా ఉన్న వ్యక్తిని ఎలా విలన్‌గా మార్చేశారు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు

ఘర్షణ సినిమాలో సలీమ్ బేగ్ పాండా అనే భయంకరమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించాడు ఈ పాత్ర ద్వారా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలోని అతని విలన్ గెటప్ నటన అన్నీ ప్రేక్షకులపై భారీ ప్రభావం చూపాయి అలాగే రవి ప్రకాష్ వంశీ కృష్ణ తదితరులు కూడా కీలక పాత్రలు పోషించారు కొన్ని టాలీవుడ్ కోలీవుడ్ కన్నడ సినిమాల్లో కూడా సలీమ్ విలన్ పాత్రలతో మంచి గుర్తింపు పొందాడు అయినప్పటికీ ఆయన కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నారు ఒకప్పుడు సినిమాల్లో బిజీగా ఉన్న సలీమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో కనిపించడంలేదు సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండకపోవడంతో ప్రేక్షకులు ఆయన గురించి సుదీర్ఘంగా మర్చిపోయారు ఇదిలా ఉండగా సలీమ్ బేగ్ షేర్ చేసిన టీనేజ్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోల్లో సలీమ్ పూర్తి హీరోలా కనిపిస్తూ నెటిజన్లని ఆశ్చర్యపరుస్తున్నాడు ఇప్పుడు చూస్తే హీరోలా ఉన్నాడు కానీ అప్పట్లో విలన్ గా ఎలా నటించారో తెలియడం లేదు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

   lankan t20 league. Former shеffіеld unіtеd dеfеndеr george bаldосk dies aged 31 | ap news. “since, i’ve worn it to cocktail events, and you’d never know it once doubled as a wedding dress ! ”.