ట్రంప్ వాణిజ్య యుద్ధం – ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు పెట్టిన వాణిజ్య యుద్ధం ఎఫెక్ట్ భారీగా ఉండేలా కనిపిస్తోంది. “అసలు సినిమా ముందుంది” అనేలా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తున్నాయి. రెసిప్రొకల్ టాక్స్ అంటూ అన్ని దేశాలను షేక్ చేస్తున్న ట్రంప్, ఈ దూకుడుతో పలు దేశాలను ప్రతిస్పందనకు దిగేలా చేశారు. ఇప్పటికే కెనడా, మెక్సికో, చైనా ట్రంప్ నిర్ణయాలకు గట్టి కౌంటర్ ఇచ్చాయి.
అమెరికా-కెనడా-మెక్సికో మధ్య తారీఫ్ లు
కెనడా, మెక్సికోపై ట్రంప్ ప్రభుత్వం విధించిన కొత్త దిగుమతి సుంకాలు వాణిజ్య యుద్ధాన్ని మరింత తీవ్రమయ్యేలా చేశాయి. అమెరికా 25% పన్నులు విధించగా, కెనడా కూడా అదే స్థాయిలో పన్నులు విధించింది. మేక్సికో కూడా అమెరికా పట్ల అదే విధంగా ప్రతిస్పందించింది. ట్రూడో ప్రకటన ప్రకారం, అమెరికా నుండి దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు, ఇతర నిత్యవసరాలపై 25% టారీఫ్ అమలులోకి వచ్చాయి.
చైనా కౌంటర్—టారిఫ్ వార్ లో మరింత ఉధృతత
ట్రంప్ అమెరికా ఉత్పత్తులపై చైనా భారీగా పన్నులు విధించింది. 10-15% పన్నులతో పాటు, కొన్ని ముఖ్యమైన ఉత్పత్తులపై 25% వరకూ పన్నులు విధించాలని చైనా ప్రకటించింది. ప్రధానంగా, జొన్నలు, సోయాబీన్, ఫోర్క్, బీఫ్, చేపలు, పీతలు, పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులు ఈ ప్రభావానికి గురయ్యాయి. మార్చి 10 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి.
చైనాకు, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు ఫిర్యాదు
ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంఖనాలపై చైనా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) లో అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇదే సమయంలో అమెరికా టెక్నాలజీ సంస్థలపై చైనా కొత్త నిబంధనలు విధించింది. రక్షణ, భద్రత, వైమానిక, ఐటీ రంగాల్లో 10 ప్రధాన అమెరికా కంపెనీలపై లక్షలు విధించింది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
టారిఫ్ వార్ కారణంగా అమెరికా మార్కెట్‌లో ఒడిదొడుకులు వస్తున్నాయి. ఏషియా పసిఫిక్, ఆస్ట్రేలియా మార్కెట్లలో నష్టాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో కూడా ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయనే ఆందోళన నెలకొంది. అమెరికా ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కార్లకు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది.ఈ వాణిజ్య యుద్ధం ఇంకా తేలిపోతుందని అనుకోవడం పొరపాటే! అమెరికా, చైనా, కెనడా, మెక్సికో ల మధ్య తారీఫ్‌లు పెరిగే అవకాశం ఉంది. “అసలు సినిమా ముందుంది!” ఎందుకంటే, వాణిజ్య యుద్ధం కొనసాగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించనుంది. దీని ప్రభావం భారతదేశం సహా అనేక దేశాలపై పడే అవకాశం ఉంది.
మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు ఇటీవల కాలంలో మహిళలపై లైంగిక వేదింపులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగాయి. ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. Read more
దడ పెడుతున్న GBS వైరస్: ప్రస్తుతం ‘దడపెడుతున్న GBS వైరస్’ దేశవ్యాప్తంగా కాస్తా ఆందోళన కలిగిస్తున్న వ్యాధిగా మారింది. ఈ వ్యాధి మొదట మహారాష్ట్రలో కనిపించింది. కానీ Read more
పిల్లలకు మొబైల్ ప్రభావం ఇప్పటి తరం పిల్లలకు మొబైల్ అనేది నిత్యవసర వస్తువుగా మారింది. ఇది చదువుకు, వినోదానికి, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుందనే నిజం ఉన్నప్పటికీ, దాని Read more
న్యాయవ్యవస్థ అవినీతి: పెరుగుతున్న ఆందోళన న్యాయ వ్యవస్థలో, ముఖ్యంగా ఉన్నతస్థాయిల్లో, అవినీతి పెరుగుతున్నదనే భయంకరమైన వాస్తవాన్ని జస్టిస్ యశ్వంత్ వర్మ వివరించారు. 'రూమ్ అంతా డబ్బులే' అన్నట్టుగా, Read more