The opposition games will no longer be valid ..Vijayashanti

ఇక పై ప్రతిపక్షం ఆటలు చెల్లవు : విజయశాంతి

హైదరాబాద్‌: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో విజయశాంతి పేరు ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై తాజాగా ఆమె స్పందించారు. ఉద్యమ కారులకు సంతోషంగా ఉంది. 28 ఏండ్లు తెలంగాణ కోసం కొట్లాడాము. కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషం. సోనియా గాంధీకి కృతజ్ఞత చెప్పాలి అని విజయశాంతి అన్నారు. అలాగే హైకమాండ్ నాకు అవకాశం ఇచ్చింది. ఇక నుండి ప్రతిపక్షం ఆటలు చెల్లవు అన్నారు.

Advertisements
ఇక పై ప్రతిపక్షం ఆటలు

అందుకే ఓపిక పట్టిన

గత 10 ఏళ్లలో ఖజానా ఖాళీ చేశారు. సీఎం కింద మీద పడి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ కి ఎక్కువ పని చేసింది నేనే. 2023 లో నాకు ఎమ్మెల్సీ ఇస్తామని హైకమాండ్ చెప్పింది. ఆ తర్వాత నేను అడగలేదు. అయితే పార్టీ హైకమాండ్ ఎప్పుడు ఎవరికి ఏ బాధ్యత ఇస్తుందో తెలియదు. అందుకే ఓపిక పట్టిన. ఇప్పుడు ఆ అవకాశం వచ్చింది. ఉద్యమ కారులం మేమంతా. కాబట్టి మమల్ని గుర్తించినందుకు సంతోషంగా ఉందన్నారు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు

పార్టీ అధిష్ఠానం తనకు ఏ అవకాశం ఇచ్చినా తనకు పదవుల వంటివి వద్దని, తాను ముందు పనిచేస్తానని చెప్పానని విజయశాంతి తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆహ్వానం మేరకు తాను మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చానని చెప్పారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌తో పాటు విజయశాంతికి ఆ పార్టీ అధిష్ఠానం టికెట్లు ఖరారు చేస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది.

Related Posts
అల్లు అర్జున్ కు హైకోర్టులో బిగ్ రిలీఫ్
bunny happy

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలోని వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఇంటికి భారీ Read more

ఎమ్మెల్సీ స్థానాన్నికేటాయించిన కాంగ్రెస్:విజయశాంతికి టికెట్
ఎమ్మెల్సీ స్థానాన్నికేటాయించిన కాంగ్రెస్ విజయశాంతికి టికెట్

ఎమ్మెల్సీ స్థానాన్నికేటాయించిన కాంగ్రెస్:విజయశాంతికి టికెట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల Read more

US Homeland: హార్వర్డ్‌కి అమెరికా హోంల్యాండ్ శాఖ పెద్ద షాక్
హార్వర్డ్‌కి అమెరికా హోంల్యాండ్ శాఖ పెద్ద షాక్

విదేశీ విద్యార్థుల చేర్పు అధికారాన్ని రద్దు చేస్తామని హెచ్చరిక అంతర్జాతీయ విద్యార్థులపై చట్టవిరుద్ధమైన, హింసాత్మక కార్యకలాపాల రికార్డులు ఏప్రిల్ 30, 2025 లోపు అందించకపోతే, హార్వర్డ్ విశ్వవిద్యాలయం Read more

Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం
Delimitation: నేడే తమిళనాడులో డీలిమిటేషన్‌ సమావేశం

చెన్నైలో అఖిలపక్ష సమావేశం – దక్షిణాది ఐక్యరూపం లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే ఆధ్వర్యంలో చెన్నైలో అఖిలపక్ష సమావేశం Read more

×