Form-7 : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా సమర్పించే ఫామ్-6, 6A, 7 మరియు 8 దరఖాస్తుల్లో తప్పుడు సమాచారం లేదా అసత్య ప్రకటనలు ఇస్తే చట్టపరమైన తీవ్ర చర్యలు తప్పవని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) సి. సుదర్శన్ రెడ్డి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగా సమర్పిస్తున్న ‘ఫామ్-7’ బల్క్ (సమూహ) దరఖాస్తులపై ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన వెల్లడించారు. సరైన కారణాలు లేనివి, దరఖాస్తుదారు వివరాలు సరిగా లేనివి మరియు సంతకాలు లేని నకిలీ బల్క్ ఫామ్‌లను తక్షణమే తిరస్కరిస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా తప్పుడు సమాచారంతో దరఖాస్తులు చేసిన వారిపై ప్రాసిక్యూషన్ చేపడతామని స్పష్టం చేశారు.
Read Also : శ్రీచైతన్య హాస్టల్లో విద్యార్థిపై దాడి

క్షేత్రస్థాయి విచారణకే ప్రాధాన్యం: జిల్లా కలెక్టర్లు, DEOలకు కీలక ఆదేశాలు
ఓటర్ల నమోదు లేదా తొలగింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగాలని, ఏ ఒక్క అర్హులైన ఓటరు కూడా తమ హక్కును కోల్పోకూడదని సీఈవో పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలక్టర్స్ రూల్స్-1960 లోని రూల్ 20 ప్రకారం పక్కాగా క్షేత్రస్థాయి విచారణ నిర్వహించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌తో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులకు (DEOs) మరియు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (EROs) కఠిన ఉత్తర్వులు అందజేశారు. సామూహికంగా అర్జీలు ఇచ్చి ఓటర్ల జాబితాను కలవరపెట్టేందుకు యత్నించే అసత్య ప్రచారకులను మరియు నకిలీ దరఖాస్తుదారులను ఉపేక్షించబోమని తేల్చిచెప్పారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :