Singer Kalpana commits suicide attempt...treated on ventilator

సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్..వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్‌: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యకు పాల్పడటం తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. బలవన్మరణానికి పాలు పడాల్సిన అవసరం ఆమెకు ఏం వచ్చింది? ఎందుకు ఈ పని చేశారు? అనే కారణాలు తెలియాల్సి ఉంది. నిజాంపేటలో కల్పన నివాసం ఉంటున్నారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా తీసుకుని జీవిస్తున్నారు. ఆ విల్లాలో నిద్ర మాత్రలు మింగి ఆవిడ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారని తెలిసింది. ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

సింగర్ కల్పన సూసైడ్ అటెంప్ట్

కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో ఆమె భర్త చెన్నైలో ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. రెండు రోజలుగా విల్లా గేట్లు ఓపెన్ చేయకపోవడంతో అసోసియేషన్ సభ్యులకు సందేహం కలిగి ఆవిడకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదట. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి గేట్లు ఓపెన్ చేయగా… కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారట. ప్రస్తుతం కల్పనకు వెంటిలేటర్ మీద వైద్యులు చికిత్స అందిస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆవిడ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందట. కొన్ని గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారట.

కాగా, కల్పనను ఆస్పత్రికి తరలిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఆవిడ ఫేస్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. కల్పన ముఖం అంతలా మారిందేమిటి? అని ఆశ్చర్యపోతున్నారు. ఆవిడ త్వరగా కోలుకోవాలని పరిశ్రమ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమయంలో విల్లాలో ఇతరులు ఎవరైనా ఉన్నారా? ఆవిడ కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారు? పోలీసులకు కల్పన ఆత్మహత్యకు పాల్పడిన సమాచారం ఎవరు అందించారు? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు జరుగుతోందని సమాచారం అందుతుంది.

Related Posts
సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు
saif ali khan

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బాంద్రా ప్రాంతం అంటే.. అక్కడ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు నివసిస్తూ ఉంటారు. అయితే సెలబ్రిటీల నివాసాలు అంటే హై సెక్యూరిటీ Read more

చాట్ జీపీటీ సృష్టికర్త సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి
OpenAI whistleblower Suchir

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో విశిష్టమైన పేరు సంపాదించుకున్న ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్ సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. సుచిర్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని Read more

హీరో మంచు విష్ణుకు ఉపశమనం.. ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు
Manchu Vishnu.jpg

ఇటీవల సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆకతాయిలు సెలబ్రిటీలకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. వీరు ముఖ్యంగా వ్యూస్ కోసం అవహేళన చేస్తూ తప్పుడు వీడియోలు Read more

‘OG’ కోసం నేనూ వెయిటింగ్ – చరణ్
i am also waiting

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'OG' చిత్రంపై మెగా హీరో రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో Read more