తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మృతులను సిద్ధరామప్ప (71), జగన్నాథ్ (41), రేణుక (36), వినయ్ (15)గా గుర్తించారు.
వీరంతా పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా, కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.