క్రికెట్ అభిమానుల కోసం జియో కొత్త క్రికెట్ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటీవలే జియో సినిమా, డిస్నీ హాట్‌స్టార్ విలీనమై ‘జియో హాట్‌స్టార్’గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఛాంపియన్స్ ట్రోఫీ, IPL టోర్నమెంట్లను దృష్టిలో ఉంచుకుని జియో వినియోగదారులకు ప్రత్యేకమైన డేటా ప్లాన్‌ను ప్రకటించింది.

క్రికెట్ స్పెషల్ ప్యాక్ ప్లాన్స్
ఈ క్రికెట్ స్పెషల్ ప్యాక్‌లో భాగంగా, రూ.195 చెల్లిస్తే 15GB హైస్పీడ్ డేటాతో పాటు, 90 రోజుల పాటు ‘Jio Hotstar’ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. క్రికెట్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంజాయ్ చేయడానికి ఈ ప్లాన్ అందరికీ ఉపయోగకరంగా మారనుంది. IPL, ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి క్రికెట్ టోర్నమెంట్లు జియో హాట్‌స్టార్‌లో ప్రసారమవుతుండటంతో, ఈ ప్లాన్ తీసుకుంటే డేటా మరియు సబ్‌స్క్రిప్షన్ రెండూ లభించే అవకాశం ఉంది.
తక్కువ ధరలోనే అధిక డేటాతో పాటు స్ట్రీమింగ్
క్రికెట్ సీజన్‌ను మరింత ఆసక్తిగా వీక్షించాలనుకునే జియో వినియోగదారులకు ఈ ప్లాన్ హాట్‌ఫేవరేట్‌గా మారే అవకాశం ఉంది. ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా, తక్కువ ధరలోనే అధిక డేటాతో పాటు స్ట్రీమింగ్ సౌకర్యం లభించడంతో, ఇది మార్కెట్లో మంచి స్పందన పొందే అవకాశం ఉంది. క్రికెట్ లవర్స్ ఈ ఆఫర్‌ను మిస్ కాకుండా వీలైనంత త్వరగా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.