Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్

singer rahul sipligunj

‘ఆర్ఆర్ఆర్’ సినిమా లోని ‘నాటు నాటు’ పాటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన ప్రతిభతో విశేష అభిమానం సంపాదించారు బిగ్ బాస్ ఫేమ్‌గా తనకు మంచి క్రేజ్ ఉందని అభిమానుల మధ్య మంచి గుర్తింపు ఉందని తెలిసిందే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రాహుల్ తన వ్యక్తిగత జీవితంలోని ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు అది తన జీవితంలో చేసిన ఒక తప్పు అని తెలిపారు రాహుల్ తనకు సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పి ఆయనను కలిసిన సందర్భాన్ని గుర్తు చేసుకున్నారు అన్నాత్తే సినిమా షూటింగ్ సమయంలో రజనీతో ప్రత్యక్షంగా కలిసే అవకాశం రావడం తనకు గొప్ప అనుభవంగా మారిందని తన అభిమానాన్ని గమనించి రజనీ ఆ సినిమాలోని లుక్‌లోనే తనతో ఫోటో దిగారని రాహుల్ వివరించారు.

అయితే రజనీకాంత్ ఈ లుక్‌ను రహస్యంగా ఉంచాలని సినిమా విడుదలయ్యే వరకు ఆ ఫోటోను బయట పెట్టవద్దని ఆయనకు చెప్పినప్పటికీ రాహుల్ కొంతకాలం తర్వాత ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఫోటో వైరల్ కావడం రాహుల్‌కు అప్పట్లో ఆనందంగా అనిపించినా రజనీకాంత్ చెప్పిన మాటను పాటించకపోవడం తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అని రాహుల్ అంగీకరించారు ఆ ఫోటో షేర్ చేసిన తర్వాత అది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది కానీ రజనీకాంత్ గారి మాటను పట్టించుకోకుండా దానిని పబ్లిక్ చేయడం నా జీవితంలో చేసిన తప్పు అని ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను అలా చేయడం వల్ల నాకు చాలా బాధ కలిగింది కానీ ఆ సమయంలో అనుకోకుండా చేశాను అని రాహుల్ ఆ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ ఈ ఇంటర్వ్యూలో నిజాయితీగా తన భావాలను పంచుకోవడం ద్వారా అభిమానుల మనసులను మళ్ళీ గెలుచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

India vs west indies 2023. Facing wаr іn thе mіddlе eаѕt and ukraine, thе us lооkѕ fееblе. Chinese ambitions for us allies prompts washington security summit with japan, philippines.