రాహుల్ జీ తెలంగాణకు రండి..యువత పిలుస్తోంది..: కేటీఆర్

Rahul ji come to Telangana.youth is calling

హైదరాబాద్‌: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్ నగర్‌లో నిరుద్యోగ యువతను కలిసిన విషయం తెలిసిందే.ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ చేసిన ఓ ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ కేటీఆర్ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

‘హలో రాహుల్ గాంధీ జీ, తెలంగాణ యువత మీరు చెప్పిన ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. 8 నెలల తర్వాత కాంగ్రెస్ విడుదల చేసిన ‘జాబ్ లెస్ క్యాలెండర్, జీరో ఉద్యోగాల కారణంగా యువత ఆందోళన బాట పట్టారు.మీరు ఎందుకు మళ్లీ హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చి అదే యువతను కలిసి మీరిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారో చెప్పొచ్చు కదా’.. అని సూచించారు.

గతంలో రాహుల్ చేసిన ట్వీట్‌లో ‘తెలంగాణ యువత దొరల కేసీఆర్ పాలనలో తీవ్ర ఇబ్బందులు పడుతోందని..తన అశోక్ నగర్ పర్యటన తర్వాత ఈ విషయం స్పష్టమైందని.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వారి సమస్యను పరిష్కరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు, టీజీపీఎస్సీని యూపీఎస్సీలా పునరుద్ధరిస్తామన్నారు. యువవికాసం పథకం కింద 5 లక్షల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. యువత ప్రజాపాలన సాగించే కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని ఇదే నా గ్యారంటీ’ అని ట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whаt wіll іt tаkе tо turn the tіdе ?. Hundreds of pro palestinian demonstrators gathered at kent state university in. To help you to predict better.