తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి

Professor Balakishtar Reddy as the Chairman of Telangana Higher Education Council

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డిని నియ‌మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే వైస్‌ చైర్మన్‌గా ప్రొఫెసర్‌ ఇటిక్యాల పురుషోత్తంను నియమించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. వీరిద్ద‌రూ ఆయా ప‌ద‌వుల్లో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా, ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి ప్రస్తుతం నల్సార్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా ఉన్నారు.

ఈ రెండు నియామ‌కాల‌తో పాటు రాష్ట్రంలోని ప‌లు విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇంఛార్జి వీసీల‌ను ప్ర‌భుత్వం మార్చింది. కోఠి మహిళా యూనివర్సిటీ ఇంఛార్జి వీసీగా ధనావత్‌ సూర్య, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇంఛార్జి వీసీగా ప్రొఫెసర్‌ గోవర్ధన్‌ను నియమించారు. కాగా, సూర్య ప్ర‌స్తుతం ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ క‌ళాశాల తెలుగు విభాగంలో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

But іѕ іt juѕt an асt ?. Coaching methodik life und business coaching in wien tobias judmaier, msc. India vs west indies 2023.