మహాత్ముడికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

President and Prime Minister paid tribute to the Mahatma

న్యూఢిల్లీ: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ నివాళులర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్దకు వెళ్లిన వారు మహాత్ముడికి అంజలి ఘటించారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు బాపూజీకి నివాళులర్పించారు. ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ దన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా, ఢిల్లీ సీఎం అతిశీ రాజ్‌ఘాట్‌ సందర్శించించారు.

అంతకుముందు ప్రధాని మోడీ ట్విట్టర్‌ (ఎక్స్‌) వేదికగా మహాత్మా గాంధీని స్మరించుకున్నారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే మూడు సిద్ధాంతాలతోనే మహాత్ముడి జీవితం గడిచిందని తెలిపారు. బాపూజీ ఆదర్శాలు దేశ ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిని ఇస్తాయని పేర్కొన్నారు.